ప్రార్థన దేవునితో జరిపే సంభాషణ
ప్రార్థనే మనకు కలిగించు దీవెన
బాలలు సమూయేలువలె ప్రార్థించాలి
యవనులు తిమొతివలె ప్రార్థించాలి
ప్రార్థించిన అన్నాయే మాదిరి
ఉదయాన దావీదువలె ప్రార్థించాలి
మధ్యాహ్నాన దానియేలువలె ప్రార్థించాలి
ప్రార్థించిన పౌలు సీలలే మాదిరి
అపాయంలో పేతురువలె ప్రార్థించాలి
దుఃఖములో హన్నావలె ప్రార్థించాలి
బహు శ్రమలో ప్రభుని విడువక
ప్రార్థించిన యోబు కదా మాదిరి
ఆరంభమున ఎలియాజరువలె ప్రార్థించాలి
ముగింపులో సొలోమోనువలె ప్రార్థించాలి
ప్రార్థించిన ఆది సంఘమే మాదిరి