LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Kalaganti Kalaganti

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి
ఎల్లలోకములకు అప్పడగు తిరు వెంకటాద్రీశు గంటి

కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి
ఎల్లలోకములకు అప్పడగు తిరు వెంకటాద్రీశు గంటి
ఇప్పుడిటు కలగంటి

అతిశయంబైన శేషాద్రి శిఖరము గంటి
ప్రతిలేని గోపుర ప్రభలు గంటి
శతకోటి సూర్య తేజములు వెలుగగా గంటి
చతురాస్యు పొడగంటి
చతురాస్యు పొడగంటి చయ్యన మేలుకొంటి

ఇప్పుడిటు కలగంటి

అరుదైన శంఖచక్రాదులు ఇరుగడ గంటి
సరిలేని అభయ హస్తమును కంటి
తిరు వెంకటాచలాధిపుని చూడగా గంటి
హరిగంటి గురుగంటి
హరిగంటి గురుగంటి అంతట మేలుకొంటి

కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి
ఎల్లలోకములకు అప్పడగు తిరు వెంకటాద్రీశు గంటి
ఇప్పుడిటు కలగంటి
ఇప్పుడిటు కలగంటి

WRITERS

Annamayya Keerthana

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other