గుండెలో చిన్ని గుండెలో ఏడు రంగుల వాన
జతగా అడుగేసాక నువ్వు నాతోన
ఎండలో మండుటెండలో వెండి వెన్నెల వాన
తెలుసా నీకోసమే నన్నే దాచాలే
ప్రాణం పంచేంతగా ప్రేమించాలే
తెలుసా నీకోసమే ఏదైనా చేస్తాలే
రోజంతా కాలు కందకుండా నిన్ను చూసుకుంటా
కూసింత అందమైన నవ్వు అందనివ్వమంటా
పంచుకుంటే ప్రతి ఊసు ఎంత తీయనో
నువ్వు పంచుకున్నాకే నాకే తెలిసే
కలిసి మోస్తే ప్రతి భారం ఎంత తేలికో
నీతో కలిసి మోసాకే అర్థం అయ్యే
తెలుసా నీకోసమే నన్నే దాచాలే
ప్రాణం పంచేంతగా ప్రేమించాలే
తెలుసా నీకోసమే ఏదైనా చేస్తాలే
రురురు రురురు రురురు రురురు రురురు
తననన టాటాటౌ తననన టాటాటౌ తననన టాటాటౌ తననాన
గుండెలో చిన్ని గుండెలో ఏడు రంగుల వాన
జతగా అడుగేసాక నువ్వు నాతోన
ఎండలో మండుటెండలో వెండి వెన్నెల వాన
తెలుసా నీకోసమే నన్నే దాచాలే
ప్రాణం పంచేంతగా ప్రేమించాలే
తెలుసా నీకోసమే ఏదైనా చేస్తాలే
తెలుసా నీకోసమే తననే దాచాడే
ప్రాణం పంచేంతలా ప్రేమించాడే
తెలుసా నీకోసమే ఏదైనా చేస్తాడే