LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Virisina

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
విరిసిన ప్రాయం నీదే మధుబాల
విసిరిన బాణం నేనై నిలువెల్లా
ఒకటై ఆడే వేళ రసలీలా
మిగిలిన లోకంతోటి మనకేలా
తకధీం తాళం తడి హిందోళం
కలిసే కాలం కసి కల్లోలం
లేత అధరమే సుమధురమే అడిగినదే అనుభవమే
పూల ఘుమఘుమే మధువనమై తాకే తడిలోన
వింత సమరమే నరనరమే జరిపినదే ప్రతిక్షణమై
జంట విజయమే చేరి సగమై సాగే సడిలోనా
విరిసిన ప్రాయం నీదే మధుబాల విసిరిన బాణం నేనై నిలువెల్లా
ఒకటై ఆడే వేళ రసలీలా మిగిలిన లోకంతోటి మనకేలా

వైశాఖమై వయసు తాపం తాకిందిలా తనువు పుష్పం
చెయ్యాలిలా వలపు స్నానం తీరేనంటా విరహ దోషం
సంయోగమే హృదయ రాగం తీరాలిలా సుఖ సముద్రం
పండేనంట ఇలలో స్వర్గం

అసలు ఎవరెవరు అని రహస్యం పట్టి బంధించని
ఇరువురిక ఒకరని నిజాన్ని ఎత్తి చూపించనీ
సొగసరి సొగసులు పరుపులా మారి పిలిచే వేళ వెలిగే కోరికలా
పిడికెడు తడిపొడి నడుమునే పట్టి నడిపేస్తానులే
కసి కసి విరుపులు మెరుపులా చేరి మెరిసే వేళ విరిసే హంపి కల
మగసిరి తెగువతో పడుచు పాఠాలు చదివేస్తానులే
వయ్యారి గోదారి వళ్లోకి నే జారి చూసానులే లోతులే
జారాక ఓసారి తేలేటి ఏదారి నా ముందరే లేదులే
జతగా జాతరగా కౌగిలియే లోకముగా
లేత అధరమే సుమధురమే అడిగినదే అనుభవమే
పూల గుమగుమే మధువనమై తాకే తడిలోన
వింత సమరమే నరనరమే జరిపినదే ప్రతిక్షణమై
జంట విజయమే చేరి సగమై సాగే సడిలోనా
విరిసిన ప్రాయం నీదే మధుబాల

WRITERS

REHMAN, ARUN MURALEEDHARAN

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist