ఈడ రైతుకి పనికిరాని సర్కారులెందుకు
బతుకు తెరువు నేర్పలేని పాఠశాలలెందుకు
ప్రేమ ఉన్న చోట నువ్వు మోహం వెతినెందుకు
ఇన్ని తెలిసి అడుగుతావు ఆత్మహత్యలెందుకు
Life లో బాధ కాదు బాధలోనే life ఉంది
ఫలితం లేదు కష్టం కంటిముందు ఉంది
కంటి నిండా నీరు రెక్క పైన భారముంది
గుండెలో ఇంక నమ్మకం కొంచెం మిగిలి ఉంది
కాకి చొక్క తెల్ల బట్టలా కాలు నాకే
మనిషిలోన మానవత్వం ఉత్త మంట కలిసే
నోటు చుక్క ముందు బతుకు మొత్తం తెల్లబోయే
వార్త చెప్పే నోరు కూడా నోటు కోసం వాగుతుంది
జాతకాన్ని మార్చి చూడు పచ్చగున్న ఈ నోటు
నమ్మకం అప్పుగిస్తే వడ్డీతోనే వెన్నుపోట్లు
కుటికి లేదు మొర్రో అంటే దర్నాలకు పది కోట్లు
కింద వాన్ని మనం తొక్కి తొక్కి
కింద వాన్ని మనం తొక్కి తొక్కి
మనుషులంతా మంచోళ్లు వెలుగుండే వరకే
చీకటవ్వగానే లోన మృగాలన్నీ బయటికే
రాబందుల సంచరిస్తూ రాతిరంటే భయపెడుతూ
కుక్కలాగా మీదపడుతూ ప్రాణం తీసే చిల్లరోళ్లు
మార్కులంటూ ఒళ్లు నిమిరే కళాశాల గురువుగాళ్లు
రక్షించే చేతులతో రక్కె నేడు పోలీసోడు
చెప్పుకుంటూ పోతే ఇలా పాపాలకు అంతే లేదు
నమ్మి నిన్ను ప్రేమిస్తే పచ్చి మోసమెందుకు
మూడు పూట్ల కూడు పెడితే తాగి తన్నుడెందుకూ
పాలు తాగే పాపపైన మానభంగమెందుకో
ఆడుకునే వయసు తనది ప్రాణం తీశావెందుకూ
ఎందుకు ఎందుకు ఎందుకెందుకెందుకూ
ఆడపిల్ల అంటే నీకు అంత చులకనెందుకూ
జన్మనిచ్చినమ్మ కూడా ఆడవారే తెలుసుకో
ఓ మొడ్డతోటి పుట్టగానే అహంకారమెందుకు
బతకుదామా రా (మోసాలు ఎన్నో చేసి చేసి)
బతకుదామా రా (ఆడపిల్ల నువ్వు తొక్కి తొక్కి)
బతకుదామా రా (అమ్మ జాతి నువ్వు ఏడిపించి)
బతకుదామా రా (ఆ సిగ్గులేని జీవితాన్ని)
బతకుదామా రా (మోసాలు ఎన్నో చేసి చేసి)
బతకుదామా రా (ఆడపిల్ల నువ్వు తొక్కి తొక్కి)
బతకుదామా రా (అమ్మ జాతి నువ్వు ఏడిపించి)
బతకుదామా రా (ఆ సిగ్గులేని జీవితాన్ని)
ఆ సిగ్గులేని జీవితాన్ని బతకుదామా
ఆ సిగ్గులేని జీవితాన్ని బతకుదామా