చూపుల్లో చిలిపోడే చేతల్లో మొండోడే మాటల్లో మంచోడే
పెళ్లైనా లొల్లైనా తనతోనే ఫిక్స్ అయ్యాలే
హే మల్లా రెడ్డి కాడా తెచ్చానే మల్లె మూర
నీళ్ల బాయి కాడా జల్లోనే పెడతా రా
ఎల్లారెడ్డి గూడ రాసిస్తాలే నీ పేర
ఏలు పట్టుకొని నన్నెలుకో దొరా
దీని సోకు సంతకెల్లా సుట్టుకున్నా సాలుమల్లా
వీన్ని కాకులేత్తుకెళ్లా మొత్తుకున్నా ఆగదేళ్లా
నీకు నాకు లగ్గమంటా (అస్సలింకా తగ్గోద్ధంటా)
ఊరు వాడ యెత్తిలా పోతేత్తాలా నువ్వు నేను అవుదాం జంట
గుంగురు గుంగురు గుంగురు పార్టీ
గుత్తులు గుత్తులు గులాబీలా తోటి
డుంగురు డుంగు డుంగురు డుంగురు పార్టీ
గత్తర గత్తర జెయ్యకు గంపెడు ముద్దుల తోటి
ఈ చిన్నవాడిని వెలిగియ్యాలే
ఆ తారలు అన్నీ తరిమెయ్యాలే
హే దునియా సూడాలే దుమ్ము రేగిపోవాలే
మోడీ గారే వచ్చి మనకు మద్దత్తు ఇయ్యాలే దగ్గరుండి షాధీ చేయ్యాలే
దాండియా ఆడలే దద్ధరిల్లి పోవాలే మీడియా మొత్తమ్ ఇదే కోడై కూయాలే అంబానీ అబ్బో అనాలే
అరే ఎక్కడా చూసినా అక్కడ మనదే ముచ్చట పెట్టాలే
ఎక్కడి ఎక్కడి నుంచో జనం క్యూ లు గట్టాలే
ఇంతకు మించిన సంధాది లేదని సాటింపెయ్యాలే
ఇక ప్రతి ఇంటికి ఈవెంట్ కి మన జాంటే మొదటి గెస్ట్ అయిపోవాలే
లెట్స్ గో గుంగురు గుంగురు గుంగురు పార్టీ
గుత్తులు గుత్తులు గులాబీలా తోటి
డుంగురు డుంగు డుంగురు డుంగురు పార్టీ
ఈ జిందగీ మొత్తం నీదేనంట బంగారు బుగ్గల బ్యూటీ