LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Inthenemo Inthenemo

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఇంతేనేమో ఇంతేనేమో
ఇంతవరకేనేమో..
ఈ ఇంట్లో నా కథ
అంతేనేమో అంతేనేమో
అంతులేని వేదనేమో
ఆడపిల్లను కదా
మళ్ళి తిరిగి అడుగేసేది
వచ్చి పోయే చుట్టంలానే
నేను పుట్టి పెరిగిన ఊరికి
ఇంకా పైన పొరుగూరిదాన్నే
కట్ట ధాటి గంగా నేడు
కంట పొంగేనే

ఎంత ఎంత యాతనో
ఎంత గుండె కొతనో
ప్రణమోలే పెంచుకున్న
పిచ్చి నాన్నకు

దూలం ఇరిగి భుజము ఫై
పడిన పిడుగుపాటిది
ఇంతకన్నా నరకమే లేదు జన్మకు

ఇంతేనేమో ఇంతేనేమో
ఇంతవరకేనేమో
ఈ ఇంట్లో నా కథ
ఈ ఇంట్లో నీ కథ
అంతేనేమో అంతేనేమో
అంతులేని వేదనేమో
ఆడపిల్లను కదా

అర చేతినే ఎరుపుగా
మార్చిన గోరింట కొమ్మ
నిన్నలా ఊగక
రాల్చెను చెమ్మా
వాకిట నేనేసిన
తొమ్మిది వర్ణాల ముగ్గు
విగతగా చూసేనే
విడిపోయామా

గుంజనే గుండెనే
ఎవరో అన్నంతగా
వేధనే బాధనే నాన్నకు
గూడునే విడువక
ఈడ్నే ఉండొచ్చుగా
ఎవడు రాసాడు ఈ రాతను

మొక్కుతూనే నీ పాదాలు
కడిగినాయ్యి కన్నీళ్లు
రెక్కలల్ల దాచుకొని
కాచినందుకిన్నాళ్లు
మెట్టినింట దీపమై
నీ పేరు నిలుపతనే

నీ మువ్వల గల గల
నువ్వు ఊగిన ఊయల
అరుగుపైన నువ్వు నాకు చూపిన
వెండి వెన్నెల
నేను మింగే మెతుకులా
నా మిగిలిన బతుకులా
యాదికుంటవే తల్లి
నువ్వు జన్మ జన్మల

ఇంతేనేమో
ఇంతేనేమో ఇంతవరకేనేమో
ఈ ఇంట్లో నా కథ
ఈ ఇంట్లో నీ కథ

WRITERS

CHARAN ARJUN

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other