రారమ్మా జనులారా రతనాలు దంచా
పచ్చాని పందిట్లో తలువాలు దంచా
కుసుమాంబ కుందేండ్లు చెరుకు రోకండ్లు
జాజి పూల జల్లెడ మల్లెపూల చాట
పాడుతూ పడతులు పసుపు దంచంగా
నలుగుకు నలుగుకు నలుగుకు రావయ్యా
నలుగుకు నలుగుకు నలుగుకు రావయ్యా
నలుగుకు రావయ్య నాధ శ్రీనాధ
నలుగుకు రావయ్య నాధ శ్రీనాధ
కంగారు పడుతోంది అలిగి నీ మీద
మొదలయ్యినాదంట నీ మధుర గాధ
మొదలయ్యినాదంట నీ మధుర గాధ
నీకు నాకు కుదిరింది సంబంధం
పత్రికలు పంచి అందరినింటికి రమ్మందాం…
పూలు పండ్ల నుండి మొదలు మూడు ముళ్ల దాక
మనకు మనమే ఎంచుకున్న మధుర బంధమే
భద్రగిరిలో రామచంద్రయ్య నువ్వు
జాగు సెయ్యక నువ్వు జానకి తల్లి
జావలిలు పాడు జల్దిగా వెళ్ళి
రత్నాలు కానుకలు ఆడగద్దు రామ
కనక రాశుల మించి కలవున్న భామ
సీతనే మించిన సిరి చూడ తరమా
దర్వాజ మెరిసింది ధగ ధగ మావిడి తోరణాలతో
ఆడబిడ్డలంతా వేడుకై తరలేను ఐరేని కుండలతో
ఎదురుకొల్లు ఒక మైల పోలు గట్టిి మేలాల సవ్వడితో
బంధు మిత్రులంతా సందడై చేరారు సంద్రమంత ప్రేమతో
ఈ క్షణమున మనము ఇలన శివుడు పార్వతి
జీవిత బడిలోన ఇదే మొదటి తరగతి
జీల కర్ర బెల్లం కలుపుతుంది సోపతి
కులుకుల ఈ కుమారి అయిపోతుంది శ్రీమతి
విడి విడి ఆ చుక్కలనే కులుపు ముగ్గటా
డీజే ల మోతల్లా దిగిచిక్క చిక్కా
డొల్లకులాడాలి అంటోంది అక్కా
ఆమాత్రం ఉండాలి మన ఇంటి నిక్కా
రెక్కలిప్పి ఆడుదాము ఎంచక్కా
దావత్ చెయ్యాలి షాదీ అయ్యినంకా
ఎవడు జేసిందంట ఈ రేంజ్ పెళ్లి
ఏండ్లకొద్ది చెప్పుకుంటారు వెళ్లి