నీతోటి నాకు లగ్గం అయితందంటే
సిగ్గు పడుతుంది మాఇంటి సూరు
మన పెళ్ళికి దిష్టి తీస్తారు
సిన్న నాడు ఆడుకున్న ఉత్త ఆట
అస్సలయింది ఈనాడే మొదలాట ఆట పాట
నీకు నాకు నలుగేప్పుడోయ్మే నత్త సుగుణమ్మ కొడుకా
లగ్గం ఇంక ఎన్నడనీ అడిగింది మా చింతమొలక
నీకు నాకు ముడిపడ్డదే నీలమ్మ తొలుసూరి బిడ్డా
అమ్మ జూడు సిద్ధం చేస్తుంది
అపుడే విందుకు సకినాల్ వడియాల్
కొనుక్కోవాలే కొత్తా బట్టల్
ఆర్డర్ ఇయ్యాలే కమ్మలు బుట్టల్
మా అత్తగారు పెట్టే అద్దాల బీరువా తాళాలు నడుముకు గుచ్చాలే
మా మేనమామను పంపి చారిగారితో డబులుకాటు చేయించాలే
ఎన్ని ఏండ్ల పొద్దో మీసం మొలిచీ
విలువ పెరిగే దానికిప్పుడే నిన్ను వలచీ
మురిసేదాన్ని సినెమాలల్లేనే జూసీ
ముందుకొచ్చే ఆ సుముహూర్తం మా ఆత్రాలే తెలిసీ