పదివేల శరణు పని శాతకాదు సందుల్లా వాడల్లా సీసాల మోత తాగుబోతులంట హ్యే హ్యే... చెప్పుడు మాటలు చేతుల బేరం కూసున్నకాడ కుతికల నిండా కావాలే పెద్ద బద్మాషులంట హ్యే హ్యే..
సీసతోని సోపతి తాగుబోతు బాపతి
ఏందిరా ఈ జిందగీ దారం లేని పతంగి
ఎవరు తిట్టిన అరె ఎవరు కొట్టిన ఎవరు తిట్టిన ఎవరు కొట్టిన మేము తాగకుండ ఉండగలమా తాగి ఊగకుండా పండగలమా!
జాంగ తాత ఇల్లు కాలి ఒకడు ఏడిస్తే.. సూ.. సూది పాడుగాను! ఇల్లు కాలి ఒకడు ఏడిస్తే సుక్క లేక ఒకడు ఏడ్సిండంట
జిందగీ బిలాలే జిందగీ బిలాలే
జిలా జిలా జిలా జిలా జిందగీ బిలాలే
ఎవరు నచ్చిన అరె ఎవరు మెచ్చిన ఎవరు నచ్చిన ఎవరు మెచ్చిన మాకు రాని పని లేదుర మామ రాత్రి పండుకుంటే లేవగలమా
గడ్డం తాత: పని పాతర పెట్టి పూ.. పురుగు పాడుగాను! పని పాతర పెట్టి పులి జాతరకు పొయ్యిందంట
జిందగీ బిలాలే జిందగీ బిలాలే
జిలా జిలా జిలా జిలా జిందగీ బిలాలే
ఎవరు రాసిన అరె ఎవరు గీసిన ఎవరు రాసిన ఎవరు గీసిన మా తల రాత మార్చగలమా గిరి గీసిన గీతను చెడగొట్టగలమా
గణపతి: కూసే గాడిది ఒచ్చి మేసే గాడిది గు... గుండీడా ఇటు రా కూసే గాడిది ఒచ్చి మేసే గాడిది గుడిసెల కాలు పెట్టిందంట
జిలా జిలా జిలా జిలా జిందగీ బిలాలే