LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Kathilanti Pillave (From ""Kanyakumari"")

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
కొట్టావే పిల్లా నువ్వు
మనసుని కొల్ల గొట్టావే
చేసావే పిల్లా నువ్వు
గుండెని గుల్ల చేసావే
వయ్యారాల హొయలతోటి
చిన్నదాన సొగసుతోటి
గుండెల్లోన గుద్దావే
నా చిట్టి గుండెనెక్కి తొక్కేసావే

కత్తిలాంటి పిల్లవే కన్యాకుమారి
కొంటె చూపు చూడకే కన్యాకుమారి

పట్టేసావే పిల్లా నువ్వు
ఉడుం పట్టు పట్టేసావే
తోసేసావే పిల్లా నువ్వు
పీకల్లోతు ప్రేమలో నన్ను తోసేసావే
చూడచక్క అందమని
చెంత చేరగా వస్తే
చూపులతో చీత క్కొట్టేసి
నీ తలపుల్లోకి తన్నేసావే

కత్తిలాంటి పిల్లవే కన్యాకుమారి
కొంటె చూపు చూడకే కన్యాకుమారి

ఊరికే తిరిగే ఊహాల్ని ఊచకోత కోసావే
ఒంటరిగున్న వయసుకి వెన్నుపోటు పొడిచావే
కలలే కనే నిద్దరని
నిర్ధాక్షణ్యంగా నరికేసావే

కత్తిలాంటి పిల్లవే కన్యాకుమారి
కొంటె చూపు చూడకే కన్యాకుమారి
కంచు లాగ మీద పడతావే
కాస్త కనికరించి నన్ను చూడవే

కత్తిలాంటి పిల్లవే కన్యాకుమారి
కొంటె చూపు చూడకే కన్యాకుమారి

WRITERS

Srujan Attada

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other