విరిసే విరిసే సుమమే మనమై విరిసే
విరిసే విరిసే మనమే సుమమై విరిసే
ఇరు కనులే నువ్వైతే కనుపాపై నేనే ఉంటా
చెక్కిళ్లే నువ్వైతే చిరునవ్వై నేనే ఉంటా
కురులన్నీ నీవైతే పాపిడినై నేనే ఉంటా
అరచేతివి నీవైతే నీ రాతై గీతై నేనుంటా
విరిసే విరిసే సుమమే మనమై విరిసే
ఓ ఉదయమే నా హృదయమే చూసింది తెలుసా
నా లోకమంతా నీ లోకమంటా ఆపై నీ ఇష్టం
ఓ ఉదయమే నా హృదయమే చూసింది తెలుసా
తప్పించుకోలేవుగా ఈ కాలలే వెంటాడగా
విరిసే విరిసే సుమమే మనమై విరిసే
కిరణంలా నువ్వే ఉంటే అరుణంలా నేనే వస్తా
ఆయుష్షే నీవైతే నీ ఊపిరి నేనే అవుతా
పెదవంతా నీవైతేనే ఆ తేనె నేనే అవుతా
సన్నాయే నీవైతే నీ మేళం తాళం అవుతా
ఓ ఉదయమే నా హృదయమే చూసింది తెలుసా
నా లోకమంతా నీ లోకమంటా ఆపై నీ ఇష్టం
ఓ ఉదయమే నా హృదయమే చూసింది తెలుసా
తప్పించుకోలేవురా ఈ కాలలే వెంటాడగా
నువ్వుంటే చాలే ఈ ఋతువే చాలే
ఈ పూలే చాలే నీ నవ్వే చాలే
తప్పించుకోలేవురా ఈ కాలలే వెంటాడగా
ఓ ఉదయమే నా హృదయమే చూసింది తెలుసా
నా లోకమంతా నీ లోకమంటా ఆపై నీ ఇష్టం
ఓ ఉదయమే నా హృదయమే చూసింది తెలుసా
నా లోకమంతా నీ లోకమంటా ఆపై నీ ఇష్టం