LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Vennelalone

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
వెన్నెలలోనే వేడి ఏలనో
వేడిమి లోనే చల్ల నేలనో
ఈ మాయ ఏమో జాబిలీ
ఈ మాయ ఏమో జాబిలీ

వెన్నెలలోనే విరహ మేలనో
విరహము లోనే హాయి ఏలనో
ఈ మాయ ఏమో జాబిలీ
ఈ మాయ ఏమో జాబిలీ

మొన్నటి కన్నా నిన్న వింతగా
నిన్నటి కన్నా నేడు వింతగా
ఓఓఓ హోం హోం
మొన్నటి కన్నా నిన్న వింతగా
నిన్నటి కన్నా నేడు వింతగా
నీ సొగసూ నీ వగలూ
హాయి హాయిగా వెలసేనే
వెన్నెలలోనే వేడి ఏలనో
వేడిమి లోనే చల్ల నేలనో
ఈ మాయ ఏమో జాబిలీ
ఈ మాయ ఏమో జాబిలీ

రూపము కన్నా చూపు చల్లగా
చూపుల కన్నా చెలిమి కొల్లగా
ఓఓఓ హోం హోం
రూపము కన్నా చూపు చల్లగా
చూపుల కన్నా చెలిమి కొల్లగా
నీ కళలూ నీ హోయలూ
చల్ల చల్లగా విరిసేనే
వెన్నెలలోనే హాయి ఏలనో
వెన్నెలలోనే విరహ మేలనో
ఈ మాయ ఏమో జాబిలీ
ఈ మాయ ఏమో జాబిలీ
ఆఆఆఆఆఆఆఆఆఆ

WRITERS

Ghantashala, Pingali

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist