ఒక్కో నక్షత్రం తెంచి ఒక్కో ఆకాశం తుంచి
ఒక్కో నిమిషంలో నీకోసం దాస్తున్నా
ఒక్కో సంతోషం నుంచి ఒక్కో సంగీతం తెచ్చి
ఒక్కో నిమిషంలో నీకోసం దాస్తున్నా
ఒక్కో వానజల్లు ఒక్కో మేఘం నుంచి
ఒక్కో చందమామ ఒక్కో విశ్వం నుంచి
భరించి హరించి ప్రేమించే నీకోసం
ఒక్కో సంతోషం నుంచి ఒక్కో సంగీతం తెచ్చి
ఒక్కో నిమిషంలో నీకోసం దాస్తున్నా
ఏ మెరుపు పువ్వు నువ్వే చెలీ
నీ పలుకే గుండెలో జిలిబిలి
ఒక్కో వాయిద్యాన్ని ఒక్కో అల్లరి అడిగి
ఒక్కో గువ్వా నుంచి ఒక్కో పల్లవి తెచ్చి
ఆడించి పాడించి లాలించే నీకోసం
ఒక్కో సంతోషం నుంచి ఒక్కో సంగీతం తెచ్చి
ఒక్కో నిమిషంలో నీకోసం దాస్తున్నా
గుండెల్లో పొంగే సెలయేరులా
పుట్టేదాకా మళ్లీ నీకై చచ్చే ఆశ
చచ్చేదాకా మళ్లీ నీతో బ్రతికే ఆశ
మౌనంలో మౌనం లా నా జీవితాన్ని పంచనా
ఒక్కో నక్షత్రం తెంచి ఒక్కో ఆకాశం తుంచి
ఒక్కో నిమిషంలో నీకోసం దాస్తున్నా
ఒక్కో నక్షత్రం తెంచి ఒక్కో ఆకాశం తుంచి
ఒక్కో నిమిషంలో నీకోసం దాస్తున్నా