గమ్మత్తుగా ఉన్నదీ నమ్మేట్టు లేదే ఇది
హా హుహుహు హుహు హుహు హుహుహు
రివ్వున సాగే ఉవ్విళ్ళు మువ్వలు మోగే సవ్వళ్ళు
దాక్కొని ఉండే చిత్రాలు దాక్కుని వచ్చే మంత్రాలు
ఇంతకు ముందేవి నాలో ఇన్ని ఊహలు
ఈ తరువాతేం చూడాలో కొత్త వింతలు
ఏమైంతేనేం బానే ఉంది ఇదేమిటో
గమ్మత్తుగా ఉన్నదీ నమ్మేట్టు లేదే ఇది
తుంటరి చూపుల తుంపర్లు తుమ్మెద రేపే పుప్పోళ్ళు
నొక్కులు పూసే చెక్కిళ్ళు ఎక్కువ చేస్తే ఎక్కిళ్ళు
ఉక్కిరి బిక్కిరి కానా మరీ
చూస్తున్నా నీలో నిన్న లేని అల్లరి
వింటున్నా మాటల్లో నువ్వనని సంగతి
తెలిసిందిగా ఎంచక్కగా కథేమిటో
గమ్మత్తుగా ఉన్నదీ నమ్మేట్టు లేదే ఇది
హుహు హ్మ్మ్ ఆ ఆ ఆ ఆ ఆహాహా
అనిల్ మనం పెళ్లి చేసుకుందాం
ఎప్పుడంటే నువ్వెప్పుడంటే అప్పుడే