పెదవులు విడిరాకా నిలువవే కడదాకా జీవంలో బతకవె ఒంటరిగా లో లో ముగిసే మౌనంగా (ఓ ఓ ఓ)
ఇతరుల చిరునవ్వుల్లో నను వెలిగించావే ప్రేమా మరి నా కనుపాపల్లో నలుపై నిలిచావేమ్మా
తెలవారి తొలికాంతి నీవో బలి కోరు పంతానివో అని ఎవరినడగాలి ఏమని చెప్పాలి ఓ ఓ ఓ
వెచ్చని ఊపిరిగా వెలిగే సూరీడు చల్లని చూపులతో దీవెనలిస్తాడు
అంతటి దూరం ఉంటే బ్రతికించే వరంవుతాడు
చెంతకి చేరాడంటే చితి మంటే అవుతాడు
హలాహలం నాకు సొంతం నువ్వు తీసుకో అమృతం
అనకుంటే ఆ ప్రేమే ప్రేమ కాగలదా ఓ ఓ ఓ