LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Alli Billi Chakiligilli

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
హే అల్లీ బిల్లీ చక్కిలిగిల్లీ
రెక్కలే విప్పెను లిల్లీ
మాటలే తియ్యని చక్కరకేళి
గిల్లి గిల్లి బుగ్గలు గిల్లి
బుల్లి బుల్లి నవ్వులు జల్లి
మెల్లగా జరెనే వెన్నెల కేళి
మబ్బుల్లో పూవే తాను యదనెప్పుడో వాలెనో
నింగిలో నీలం తాను నాకందెనో
మట్టిలో పూవే తాను మదినెప్పుడు చేరెనో
చిక్కునో దక్కునో చేజారెనో
వాలే వాలే కన్నులోనా హోలే హోలే వెన్నెల వాన
కలలై కురిసే నీ వల్లేనా
తేనె తేనె మబ్బులోనా
వేల వేల రంగుల్లోనా మనసే తడిసే నీ మాయేనా

హే వెళ్ళే దారి వచ్చే దారి ఒకటే అయినా
నీకు నాకు ఇంతటి దూరం తగునా మైనా
వాన జల్లు వాన విల్లు వేరే అయినా
రెండు ఉండే నీలాకాశం ఒకటే అవునా
దృశ్యాలే వెలివేస్తే
కన్నే చూసే ప్రతి చూపు శూన్యమేగా
కొలువుండే విలువిస్తే ఈ చిటికెడంత కళ్ళు కొత్త చిత్రాలేగా
వాలే వాలే కన్నులోనా హోలే హోలే వెన్నెల వాన
కలలై కురిసే నీ వల్లేనా
తేనె తేనె పొద్దులోనా వేల వేల రంగుల్లోనా
మనసే తడిసే నీ మాయేనా

ఓ గూటికి వచ్చే గువ్వలు మళ్ళీ వలసే వెళ్ళి
రాగం లేని చెట్టుకు మళ్ళీ రంగుల Holi
ఇంటికి వచ్చే పాపే తుళ్ళి బళ్ళో కెళ్ళి
ఒంటరి అమ్మే మురిసిందంట ప్రేమే జల్లి
ఏ గుల్లో తానున్నా
పువ్వే పూసే తొలి కొమ్మ మరచిపోదే
ఏ ఊరే వెళుతున్నా సెలయేరు అలల చూపులన్నీ శిఖరం వైపే
వాలే వాలే కన్నులోనా హోలే హోలే వెన్నెల వాన
కలలై కురిసే నీ వల్లేనా తేనె తేనె పొద్దులోనా
వేల వేల రంగుల్లోనా మనసే తడిసే నీ మాయేనా

WRITERS

SRIMANI, JEEVAN BABU

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other