ఎదురుగా ఒక వెన్నెల చిరు వెలుగులు నాపై చల్లుతుందిలా
తన నవ్వుల గాలులే ఎద సడులకు తాకేలా
ఎటువైపని పాదమే ఇక అటు ఇటు వెళ్ళే వీలు లేదుగా
చిరునవ్వుల గాలమే తన వైపుగా లాగాక
ప్రపంచాన్నే నా వెంట రప్పిస్తా కదా
ఎదురుగా ఒక వెన్నెల చిరు వెలుగులు నాపై చల్లుతుందిలా
తన నవ్వుల గాలులే ఎద సడులకు తాకేలా
కళ్ళతోటి చూడలేని వింత మాయలవే
వేళ్ళతోటి రాయలేని కొత్త మాటలా
అంత ఉత్సాహమై నాలో పొంగేవులే
అంతులేని సాగరాన ఉన్న దీవిలా
అంధకారమైన చోట చిన్న దివ్వెలా
ఆగిపోయిన ఆశకే ఇల మల్లి నీ ప్రేమ ప్రాణమాయేలే
కళ్ళే కలగా నిలిచే చోటే నిలబడకు
నిజమై కదిలే నిమిషం చూపే దిశకు
అడుగే పడని కలిసొస్తాగా ఎపుడూ
ఎదురుగా ఒక వెన్నెల చిరు వెలుగులు నాపై చల్లుతుందిలా
తన నవ్వుల గాలులే ఎద సడులకు తాకేలా
ఆకాశాన్ని మోసినంత అలసిపోయా
చుక్క నీటి జాడ లేని దారి పొడువునా
దూరమెంతైనా ఏ భారముంటుందిలే
ముందరేముందో చూడలేక పోయినా
ముళ్ళతోటి వెళ్ళు బాట నిండిపోయినా
నింగి హద్దుల్ని దాటుతాను లే
క్షణము దినము ఎపుడూ ఆపకు పరుగు
జతగా నడిచే నిన్ను వీడదు నా మనసు
ఎదురుగా ఒక వెన్నెల చిరు వెలుగులు నాపై చల్లుతుందిలా
తన నవ్వుల గాలులే ఎద సడులకు తాకేలా