LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Mallieswarivey

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
వాచ్ ఆన్ వాచ్ ఆన్ వాచ్ ఆన్
వాచ్ థిస్ డూప్ డూప్ డూప్ స్టైల్
ఐ అం గొన్న డిప్ డిప్ ఇట్ ఇన్ టూ యువర్ స్మైల్
హోల్డ్ మీ బేబీ జస్ట్ హోల్డ్ మై హ్యాండ్ ఫరెవర్ అండ్ ఎవర్
ఎవరీ టైం ఐ వన్నా సి యు మై గర్ల్

మల్లీశ్వరివే మధురాశల మంజరివే
మంత్రాక్షరివే మగశ్వాసల అంజలివే
తేనెవి నువ్వో తేనెటీగవో తేలేదెలా లలనా
వెన్నెల నువ్వో వెండి మంటవో తాకే తెలుసుకోనా
చక్కనైన మల్లికవొ హే చిక్కులు పెట్టే అల్లికవో
పోలికలో పసిబాలికవే చురకత్తుల చూపులున్నా

మల్లీశ్వరివే మధురాశల మంజరివే
మంత్రాక్షరివే మగశ్వాసల అంజలివే ఓఓ

నీ కళ్ల నింగిలో పున్నాల పొంగులో
వేవేల తారకలే జలకమాడుతున్నవో
నాలోని కోరికలే మునిగి తేలుతున్నవో
సింగారి చెంపలో కెంజాయి సొంపులో
వెచ్చనైన వేడుకలే మేలుకొలుపు విన్నవో
నిదరలో ఉదయం ఎదురయే సమయం
ఎదకు ఇంద్రజాలమేదో చూపుతోందె సోయగమా

బేబీ డోంట్ యు ఎవర్ లీవ్ఐ అం యువర్ డోన్ రాజా
కం ఆన్ ఆవై టైం యూ అర్ మై ద దిలారుబా
ఐ కెన్ నెవెర్ స్టాప్ థిస్ ఫీలిం ఐ అం యూ అర్ డోన్ రాజా
యేః హే హే
మల్లీశ్వరివే మధురాశల మంజరివే
మంత్రాక్షరివే మగశ్వాసల అంజలివే హో

ఫ్రెఅకీ థిన్ అండ్ ఐ ఓన్ట్ లెట్ యు గో అండ్
ఐ ఓన్ట్ లెట్ యూ డౌన్ త్రు ది ఫైర్ ది లిమిట్
టూ ది వాల్ జస్ట్ టూ బి విత్ యూ ఐయామ్గ్డ్ రిస్క్ ఇట్ అల్
హ లెట్ మీ డూ ఇట్ వన్ మోర్ టైం
డూ ఇట్ వన్ మోర్ టైం
హ బేబీ కం ఆన్ అండ్ లెట్స్ గెట్ గెట్ ఇంటూ ది పార్టీ

కొల్లేటి సరస్సులో తుళ్లేటి చేపలై
రంగేళి కులుకులెన్నో తళుకులీనుతున్నవే
నాకొంగ జపము చూచి ఉలికి పడుతు ఉన్నవే
ఎన్నేసి మెలికలో ఎరవేసి నన్నిలా
ఏ వైపు చూపు తిప్పనీక చంపుతున్నవే
వదలదే హృదయం కదలదే నిమిషం
చిగురు పెదవి చిలిపి స్వరము తెలపవె సౌందర్యమా
మల్లీశ్వరివే మధురాశల మంజరివే
మంత్రాక్షరివే మగశ్వాసల అంజలివే
తేనెవి నువ్వో తేనెటీగవో తేలేదెలా లలనా
వెన్నెల నువ్వో వెండి మంటవో తాకే తెలుసుకోనా
చక్కనైన మల్లికవొ హే చిక్కులు పెట్టే అల్లికవో
పోలికలో పసిబాలికవే చురకత్తుల చుపులున్నా
మల్లీశ్వరివే మధురాశల మంజరివే
మంత్రాక్షరివే మగశ్వాసల అంజలివే హో

WRITERS

JESSIGIFT, SIRIVENNELA SITARAMA SASTRY

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist