LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Raja Vaaru Rani Gaaru Title Song

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
రాజావారు రాసినుత్తరం
ఊరు దాటి పోతోంది
హ్మ్ తొంభై ఊళ్ళు తిరిగీ తిరిగీ
మళ్ళీ ఎప్పుడు వస్తుంది

అనగనగనగా రాజు
సొగసరి కనుల రాణి
ఇనుకోండయ్యా సెబుతా ఇద్దరి గాథ

అనగనగనగా రాజు
సొగసరి కనుల రాణి
ఇనుకోండయ్యా సెబుతా ఇద్దరి గాథ
ఎపుడొచ్చిందో గాని ఎదురొచ్చిందోయ్ రాణి
తెగ మెచ్చాడోయ్ రాజు, మనసిచ్చాడు
గుండె గదులన్నిటిలోనూ వలపునే కొలువుంచాడు
తలుపులేసి తలపులోన తేలినాడు
లేడు మరి రాజను వాడు, రాణిమయమైపోయాడు
తనకి తానే గురుతులేడు, అడిగి సూడు
రాజావారు, రాణీగారు రేపో మాపో ఒకటౌతారు
ఊరూవాడా ఈడూజోడూ బాగుందంటారూ
రాజా వేరు, రాణి వేరు
సూత్తూ ఉండు జంటౌతారు
ఆ రోజంతా ఊరూరంతా హోరెత్తే తీరు

ఓహో మా కథకు మెచ్చి
ఓ అన్న రూపాయ్
ఓ అక్క రెండు
పెద్దాయన పది
వారిని, వారి కుటుంబాలని దేవుడు సల్లంగా సూడాల
మరి మళ్ళీ కథలోకెళ్తే

తీగని లాగక కూసుంటే
డొంకని ఎవరట కదిపేది

రాజుకి భయమట, ప్రేమని తెలుపుట సేతవదంట

లోపట సిటపట ఎద మంట
రాణికి అది ఇనబడదంట

ఆగని పరుగట, రాదట అలసటలో సలుపంట

ఏం వలపంటా
కాలం పామై కాటే ఏసెనట
ఏది రాణి లేదీ సోట

ఊరు దాటేసింది

ఏం ఫర్లేదు
రాణిగారు కచ్చితంగా తిరిగొత్తారు
రాజావారు తన ప్రేమని సెప్తారు సెప్పి తీరతారంతే

రాజావారు, రాణీగారు రేపో మాపో ఒకటౌతారు
ఊరూవాడా ఈడూజోడూ బాగుందంటారూ
రాజా వేరు, రాణి వేరు
సూత్తూ ఉండు జంటౌతారు
ఆ రోజంతా ఊరూరంతా హోరెత్తే తీరు

WRITERS

Jay Krish, Sanapati Bharadwaj Patrudu

PUBLISHERS

Lyrics © Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

LyricIQ Analysis

Top Emotion

Enjoyment

Sentiment
Thumbsup IconThumbsup Icon
Theme

None

From This Artist