పాదం విడిచి ఎటు పోయెను భువనం
ఆదమరిచి ఎటు వెళ్ళెను గగనం
నింగి నేలపై లేకుండా మనమెక్కడున్నాం
కనుల వెంట పడుతున్నాయి కలలె
మనసు ముంచి వెడుతున్నాయి అలలె
వయసు పొంచి వేస్తుంటే వలలో పడుతున్నాం
హృదయంలో ఆనందాలకి ఉదయలన్ని ఉప్పొంగే
మనతోటి చెలిమే చేసి మధురం మురిసెలే
కడతేరని కమ్మని బంధం మన కౌగిలినే కోరిందే
పాదం విడిచి ఎటు పోయెను భువనం
ఆదమరిచి ఎటు వెళ్ళెను గగనం
నింగి నేలపై లేకుండా మనమెక్కడున్నాం
కనుల వెంట పడుతున్నాయి కలలె
మనసు ముంచి వెడుతున్నాయి అలలె
వయసు పొంచి వేస్తుంటే వలలో పడుతున్నాం
హో పయనం ఈ పయనం ఏ నయనం చూపించని వైనం
నిమిషం ఈ నిమిషం నూరేళ్ళకు ప్రాణం
మనతో పరిగెడుతూ తొలి కిరణం ఓడింది తరుణం
మనలో ఈ త్వరణం కాలానికి మరణం
మనరెక్కల బలమెంతో చుక్కలకె చూపగలం
మన శ్రుతిలో తేనె గుణం ఆ చేదులో తెప్పించగలం
మన పరుగుల ఒరవడితో దూరాలను తరమగలం
హో మన ఉనికే సాక్ష్యం హో ఇది మారదులే
మనసంతా మనసంతా సంతోషం సహజంలే
మనకుండవు విభజనలే మనజట్టో త్రిభుజంలే
హృదయంలో ఆనందాలకి ఉదయలాన్ని ఉప్పొంగే
మనతోటి చెలిమే చేసి మధురం మురిసెలే
కడతేరని కమ్మని బంధం మన కౌగిలినే కోరిందే
పాదం విడిచి ఎటు పోయెను భువనం
ఆదమరిచి ఎటు వెళ్ళెను గగనం
నింగి నేలపై లేకుండా మనమెక్కడున్నాం
కనుల వెంట పడుతున్నాయి కలలె
మనసు ముంచి వెడుతున్నాయి అలలె
వయసు పొంచి వేస్తుంటే వలలో పడుతున్నాం