ఆనాటి ఆ స్నేహం ఆనందగీతం ఆ జ్ఞాపకాలన్ని మధురాతి మధురం
ఈనాడు ఆ హాయి లేదేల నేస్తం ఆరోజులు మునుముందిక రావేమిరా
లేదురా ఆ సుఖం రాదురా ఆ గతం ఏమిటో జీవితం
గోడలు దూకిన రోజులు మోకాలికి తగిలిన దెబ్బలు చీకటిలో పిల్లనుకొని
ఒరే పక్కనే పెళ్ళికావలసిన పిల్లలున్నార్రా (నేర్చుకుంటార్రా)
నేను మారలేదు నువ్వు మారలేదు కాలం మారిపోతే నేరం మనదేమి కాదు
ఈ నేల ఆ నింగి ఆలాగె వున్నా ఈ గాలి మోస్తుంది మన గాధలెన్నో
నెమరేసుకుందాము ఆ రోజులు భ్రమలాగ వుంటాయి ఆ లీలలు
ఒరే రాస్కెల్ జ్ఞాపకముందిరా కాలేజిలో క్లాస్ రూములో
ఓ పాప మీద నువ్వు పేపర్ బాల్ కొడితే
ఆ పాప యెడమ కాలి చెప్పు తీసుకొని
ఒరే ఉండరా ఊరుకోరా పిల్లలు వింటారు
వింటే వింటార్రా పిల్లల పిల్లలకు పిట్టకథలుగా చెప్పుకుంటారు
ఆ జ్ఞాపకాలన్ని మధురాతి మధురం
ఈనాడు ఆ హాయి లేదేల నేస్తం
ఆరోజులు మునుముందిక రావేమిరా
మనసే ఇచ్చినాను మరణం తెచ్చినాను చితిలో చూసినాను చిచ్చై మండినాను
నా గుండె మంటింక ఆరేదికాదు నేనుండి తనువెళ్ళి బ్రతుకింక లేదు
తన శాపమే నాకు తగిలిందిరా రే పసిపాపలే లేని ఇల్లాయెరా
ఈ కన్నుల కన్నీటికి తుదియేదిరా
ఒరే ఒరే ఏమిట్రా పసిపాపలాగా ఛ ఛ ఊరుకో
ఒరే ఈ కన్నీళ్లకు తుది ఎక్కడ్రా
ఆ జ్ఞాపకాలన్ని మధురాతి మధురం
ఆ రియల్లీ ఫబ్లౌస్ ఆహ ఆహ ఆహ ల ల ల ల ల
WRITERS
Acharya Athreya, K. Chakravarthy, Rajasri, Veturi Sundara Ramamurthy