గతమైన జీవితం కథ గానె రాసుకో
ఏ నాటి కేమవుతున్నా ఏ గూడు నీదవుతున్న..
గతమైన జీవితం కథ గానె రాసుకో
జీవితం నీకోసం స్వాగతం పలికింది
ఆశలే వెలిగించి హారతులు ఇస్తుంది
ఆకాశమంతా ఆలయం నీకోసం కట్టుకుంది
కళ్యాణ తోరణాలుగా నీ బ్రతుకే మార్చుతుంది
స్నేహం పెంచుకుంటుంది ప్రేమే పంచమంటుంది
కాలం కరిగిపొతుంతే కలగ చెదిరి పోతుంది
మాసిపోని గాయమల్లె గుండె లోనే ఉంటుంది
గతమైన జీవితం కథ గానె రాసుకో
మనిషిలొ దేవున్ని మనసుతో గెలవాలి
అందాల జీవితానికో అనుబంధం చూసుకో
అనురాగమైన లోకమే నీ సొంతం చేసుకో
లోకం చీకటవుతున్న బ్రతుకే భారమవుతున్న
మనసే జ్యోతి కావాలి మనిషే వెలుగు చూపాలి
మరో ప్రపంచ మానవుడిగా ముందు దారి చూపాలి
గతమైన జీవితం కథ గానె రాసుకో
మనసైతే మళ్ళి చదువుకో మరు జన్మ కైన కలుసుకో
ఏ నాటి కేమవుతున్నా ఏ గూడు నీదవుతున్న హాయి గానే ఆడుకో
గతమైన జీవితం కథ గానె రాసుకో