అడుగేస్తే కడలైనా దారిస్తుంది
పిలిస్తే పొడి ఇసుకైనా నీరిస్తుంది
మనసిస్తే శిలైనా ప్రేమిస్తుంది
జంటను విడదీసే జగమెప్పుడు గెలిచింది
జంటను విడదీసే జగమెప్పుడు గెలిచింది
జన్మల ముడివేసే కథ ఎప్పుడు ముగిసింది
కత్తులు తేల్చనిది , కార్ చిచ్చు కాల్చనిది
గాలులు తుంచనిది, జడివానలు ముంచనిది
ఆత్మకున్న అన్ని లక్షణాలు ఉన్న ప్రేమ
కృష్ణుడన్న గీతలోని భావమే ప్రేమ
జంటను విడదీసే జగమెప్పుడు గెలిచింది
జన్మల ముడివేసే కథ ఎప్పుడు ముగిసింది
చితినైనా బతికించే అమృతమే కాదా ప్రేమించే మనసంటే ఓ
విధినైనా ఎదిరించే నమ్మకమే రాదా ఆ మనసే నీదైతే ఓ
అందుకే పద పద తెగించి ముందుకే సదా ఎద తలొంచినందుకే
కదా ఇదంతా సహించి ఎందుకె వృథా వ్యధ భరించి
చూస్తూ కూర్చుంటే బతుకంతా బరువు కదా
బాధే బలమైతే ఎడబాటే బాటవదా
కొండనెత్తు సత్తువున్న ఎంత ఘనులైనా
జంట చిచ్చు అంటుకున్న లంకనార్పగలరా
జంటను విడదీసే జగమెప్పుడు గెలిచింది
జన్మల ముడివేసే కథ ఎప్పుడు ముగిసింది
నీకోసం జీవించే చెలిమే వెలుగవదా నువ్వు సాగే దారుల్లో ఓ
నీ పేరే ధ్యానించే పిలుపే వినలేదా నిను తాకే గాలుల్లో ఓ
ప్రాణమా నువ్వే ఇలా వేలేసి పోకుమా ఎటో అలా జతైన
పాదమా నువ్వే ఇలా శిలవైతే న్యాయమా క్షణం క్షణం వెన్నంటి
ప్రేమ నావెంటే కడదాకా నీవుంటే
నిప్పే నీరౌదా నిట్టూర్పే తూర్పౌదా
అష్టదిక్కుల అడ్డుకొచ్చి నిన్ను ఆపగలవా
సప్తసాగరాలు దాటి నన్ను చేరలేవా
జంటను విడదీసి జగమెప్పుడు గెలిచింది
జన్మల ముడివేసి కథ ఎప్పుడు ముగిసింది