నాడు పట్టుచీర కట్టవద్దు బరువన్నాడే
నేడు నూలు చీరకే డబ్బులు కరువన్నాడే
నెల తప్పిన నెలత తనకు పరువన్నడే
నేడు నెలబాలుని చేతికిస్తే బరువన్నడే
ముంగురులును చూసి నాడు మురిసిపోయాడే
ఆ కురులకు విరులివ్వడమే మరిచిపోయాడే
ప్రేమించు సీజన్లో లో పెద్ద మాటలు
పెళ్లయ్యాక ప్లేట్ ఫిరాయింపులు
మొదటి వలపు మధుర కథలు మరచెను ఘనుడు
మాటల్తో కోట కట్టాడే అమ్మో నా మహారాణి నీవన్నడే
కాలు కింద పెడితేనే కందిపోవునన్నాడే
వాలు తాకితే మోమున కాలు విరుగునన్నాడే
కవ్వించుకున్నాడే కౌగిలి కోసం
ఆ కాస్త తీరాక మొదటికే మోసం
మనవి వినడు మనసు కనడు మాయల మొగుడు
తలలో నాలుకలా పూసలలో దారంబు మాట్టి
సతి మదిలో నన్నెలగెడు పురుషుడు కలుగుట
తొలి జన్మము నోము ఫలము తోయజనెత్త్రా
తనుగా వలచిన వరుడేనా ఈ పురుషోత్తముడు
వ్రతములు సలిపిన సతులకు గతి కలదా