పుల్ల మావిళ్ళు కోరి పిల్ల వేవిళ్ళకొచ్చే
తానా తందాననానా తానా తందాననానా
మల్లె పందిళ్ళు వేసి తల్లో జాజులు పెట్టి
తానా తందాననానా తానా తందాననానా
మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు
మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు
కానుకే ఇవ్వనా చెల్లికి ఉయ్యాల
మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు
నా కన్నుల్లో కన్నీళ్లు చిందవ
అమ్మగా లాలించాడు, నిన్ను నాన్నగా పాలించాడు
అన్నగా ప్రేమించాడు అన్ని తానైనాడు
నా అమ్మలాంటి అన్న ఈ లోకాన లేడు
మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపూ
మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపూ
పట్టుచీర గట్టి సారె పెట్టరే
దిష్టి చుక్క పెట్టి హారతివ్వరే
ఇది చెల్లెలే కాదులే నను కన్న తల్లి
మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు
కమ్మగా పాడనా చంటి పాప జోల
కానుకే ఇవ్వనా చెల్లికి ఉయ్యాల
మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు
మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు