LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Thaaney Vachhindhanaa

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
తానే వచ్చిందనా
గాలే రంగుల్లో మారేనా
అరె పల్లె గాలి ఈ పిల్లై మారే నను ఊపిరల్లె అల్లేనా
వీడి గుండె చాలే నా వల్లే కాదే ఇది ముందు లేని యాతన

విడిచే యుగమైనా కలిసే క్షణమవదా
విడిగా నేనున్నా ఎదలో ఒదిగున్నా

అరె మచ్చైన మచ్చుకు లేని జాబిలి నేలకొచ్చినది
తడి ఎండిన గుండెకు ముద్దే ఇచ్చి ప్రేమ పంచినది…
అరె మచ్చైన మచ్చుకు లేని జాబిలి నేలకొచ్చినది
తడి ఎండిన గుండెకు ముద్దే ఇచ్చి ప్రేమ పంచినది
నీవేలే నా దారి
వచ్చాలే నే కోరి

వేకువే ఆగునా చీకటుందనీ
చినుకులే రాలవా దూరముందనీ
పువ్వులే పూయవా కొమ్మ అడ్డనీ
స్వప్నమే దాగునా నిదురలో అనీ

కనులే తెరిచా కలలో పిలిచా
నే గెలిచా నీకై నిలిచా

అరె రెప్పల దుప్పటి చాటు దాగిన ఘాటు వెన్నెలిది అరె
అర్ గంపెడు గుండెల దప్పు చప్పుడు పెంచి వెళ్ళినది
అరె రెప్పల దుప్పటి చాటు దాగిన ఘాటు వెన్నెలిది అరె
అర్ గంపెడు గుండెల దప్పు చప్పుడు పెంచి వెళ్ళినది
నీవేలే నా దారి
వచ్చాలే నే కోరి

ఏలే ఏలే ఎలే ఏలే ఏలే ఏలేలో
ఏలేలో ఏలేలో ఏలే ఏలేలో
తాన తందననా తాన తందనన తందనన తందనన తందనాన

WRITERS

K.K., HIPHOP TAMIZHA

PUBLISHERS

Lyrics © Universal Music Publishing Group

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other