LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Kannula Vindhaa

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
PALLAVI :
కన్నుల విందా కనబడనందా
మదిలో మెదిలే ఊహ
పూసే పూలో,వీచే గాలో
తెలియదుగా

కన్నుల కింద,కాటుక ఉందా
నల్లని చీకటి లాగా
ఎన్నో రంగులు చూసే కలలే
వెలుగు కదా

కిలకిలలా కోకిలవనా, ఎదపదమే పలకనా
మది గతిలా తుళ్లిపోనా, ప్రతి మలుపూ గమకమా

వేకువే కొత్తగా లేపెనే మత్తుగా
ఎద సల్లాపాలు, నీ సంతోషాలు
సిరి వెన్నెల్లో గోదారి పూసేటి పూదారి,నా ఎద

కన్నుల విందా కనబడనందా
మదిలో మెదిలే ఊహ
పూసే పూలో,వీచే గాలో
తెలియదుగా

కన్నుల కింద,కాటుక ఉందా
నల్లని చీకటి లాగా
ఎన్నో రంగులు చూసే కలలే
వెలుగు కదా


CHARANAM :
గలగలగల నదిలా సాగాలిలా
కిలకిలకిల పలుకై పాడాలీ ఈ వేళ

మిలమిలమిల మెరిసే, నక్షత్రాలే
మరిమరిమరి మురిసే వింటూ అలా

ఆనందం ఆహ్లాదం నీలోనే దాగుందా
అనుమతిని అడగాలా ఈ సృష్టిని కాస్తైనా

పరిచయము పరవశము
అనుభూతిని తెలిపిందా
ఇది వరమా కలవరమేనా


కన్నుల విందా కనబడనందా
మదిలో మెదిలే ఊహ
పూసే పూలో,వీచే గాలో
తెలియదుగా

కన్నుల కింద,కాటుక ఉందా
నల్లని చీకటి లాగా
ఎన్నో రంగులు చూసే కలలే
వెలుగు కదా

WRITERS

Krishna Chaitanya, Saketh Komanduri

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other