LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Prema Uyyala

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ప్రేమ ఉయ్యాలా హాయి జంపాలా ఒకరికి ఒకరుండగా
ఇంపారా నవ్వే ఇల్లాలి తోడే మగనికి బహు ముచ్చటా
మనుసొకటైతే మనదే కాదా సుఖమంతా
ప్రేమ ఉయ్యాలా హాయి జంపాలా ఒకరికి ఒకరుండగా
చిరునవ్వు చిందే శ్రీవారి పొందే సతికే పులకింతగా

అంతా కలిసి మక్కువగ్గుంటే అది చాలు
ఆడే పాడే ముద్దులు కురిసే మురిపాలు
వీణై మ్రోగే సంగీతంలా సాగే సంసారం
ఎరై పొంగే గోదారల్లే రేగే సంతోషం
దాగుడు మూతలా (జిలిబిలి చేతాల) సందడిలోనే చిగురై తొడిగే అనుబంధం
ప్రేమ ఉయ్యాలా హాయి జంపాలా ఒకరికి ఒకరుండగా
చిరు నవ్వు చిందే శ్రీవారి పొందే సతికే పులకింతగా

పొంగే హృదయం చెంతకు నిన్నే రమ్మంది
అందే అదరం సందిట మగువై పొమ్మంది
చెంపలా సిగ్గులా మొగ్గలు చల్లిన పక్కై వేయాలి
చెక్కిలి నవ్వులా చక్కిలిలో నే చుక్కై పొడవాలి
వన్నెలు వాడని (ఎన్నడు వీడని) కౌగిలిలోనే జగమే మరిచే మన జంటా
ప్రేమ ఉయ్యాలా హాయి జంపాలా ఒకరికి ఒకరుండగా
ఇంపారా నవ్వే ఇల్లాలి తోడే మగనికి బహు ముచ్చటా
ఎదలొకటైతే బ్రతుకే విరిసే పూదోటా

WRITERS

SAHITHI, M.M. KEERAVANI

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other