LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Rama Sakkani Thali

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
రామ సక్కని తల్లి రాములమ్మో రాములమ్మ రాయొలేకూసున్న వెందుకమ్మో ఎందుకమ్మా
రామ సక్కని తల్లి రాములమ్మో రాములమ్మ రాయొలేకుసున్న వెందుకమ్మో ఎందుకమ్మా

తాసుపములు కరిసె ఇసువంటి తావుల్లా
భూతాలు దెయ్యాలు తిరిగేటి గడియాల్లా
ఎండిన సెట్టుకు రాలిన ఆకులే
ఒక్కదానివి నువ్వు రాములమ్మో రాములమ్మ ఎక్కెక్కి ఎడ్సెవు ఎందుకమ్మో ఎందుకమ్మా

యెట్లా సెప్పుదునయ్యా నా బాధను నా నోటితో ఎవని సెప్పేది నా గోడును నా తండ్రితో

దెయ్యాలు ముట్టిన ఫలమయ్యిపోతిని
కన్నతల్లికి నేను బరువయ్యిపోతిని
నలుగురిలో మీకు నల్ల మగాము చేసే
ఆడపోరిగా నేను పుడితినయ్యో పుడితినయ్యా
అడవిలో మానెయ్యి పోతానయ్యె పోతనయ్యా

రామ సక్కని తల్లి రాములమ్మో రాములమ్మ రాయొలేకుసున్న వెందుకమ్మో ఎందుకమ్మా

తెలుపేదో నలుపేదో తెలువని తల్లివి
బతుకు శాపమైన బంగారు తల్లివి
నిన్ను కొట్టిన తల్లి కన్నీరు పెడుతుంది
నన్ను తల్లనుకొని రాములమ్మో రాములమ్మ ఉన్న ముచ్చట చెప్పు రాములమ్మో రాములమ్మ
రాయొలేకుసున్న వెందుకమ్మో ఎందుకమ్మా రామ సక్కని తల్లి రాములమ్మో రాములమ్మ

పటువారి దొరగారు అరిటాకులో నాకు పరవాన్నం పెడుతుంటే పరమాత్ముడనుకున్న
ఆడుకొమ్మని నాకు ఆటబొమ్మలిస్తే దయగల్ల మారాజు ధర్మాత్ముడనుకున్న
జాలితోటి నాకు జామపండు ఇచ్చి తల మీద శెయి పెడితే తండ్రి లెక్కనుకున్న
ఎండి గిన్నెలు పాలు పోసి నాకిస్తుంటే దండి గుణము చూసి దండాలు పెట్టిన
కాటు వేసేదాకా తెలవదయ్యా నాకు కడుపులో విషమయ్యి అది పెరిగిపోయింది
కొరగాని బతుకయ్యి పోయిందయ్యో పోయిందయ్యా కొరివి పెట్టి సాగనంపాలయ్యె సమపాలయ్యా
అమ్మాఆఆ
ఎన్నుపూసల నుంచి పొత్తి కడుపులోకి పలుగు వేసి పేగు పెకిలించుతున్నట్టు
యెన్నడెరుగని నొప్పి ఎందులకు నొప్పి ఈ బాధ నాకెందుకొచ్చిందయ్యో వచ్చిందయ్యా
ఈ జన్మ నాకెందుకిస్తివయ్యో ఇస్తివయ్యా

పాపమెవ్వరిదైనా పాప పుట్టే నొప్పి పురిటి తల్లికి నొప్పి పుడమి తల్లికి నొప్పి
ఆడదాని పేగు మీద రాసిన నొప్పి తల్లడిల్లకు బిడ్డ రాములమ్మో రాములమ్మ
తల్లివైతున్నవే రాములమ్మో రాములమ్మ నువ్వు తల్లివైతున్నవే రాములమ్మో రాములమ్మ
రాములమ్మో రాములమ్మ

WRITERS

SUDDHALA ASHOK TEJA, VANDEMATHARAM SRINIVAS

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other