అల్లో నేరేళ్లో అల్లో నేరేళ్లో అల్లో నేరేళ్లో అల్లో నేరేళ్లో
జనకుని కూతురు జానకి అల్లో నేరేళ్లో
జాజుల సోదరి జానకి అల్లో నేరేళ్లో
మిథిలా నగరిని జానకి అల్లో నేరేళ్లో
ముద్దుగ పెరిగిన జానకి అల్లో నేరేళ్లో
అందాల రాముని పరిణయమాడి అయోధ్య చేరును జానకి అల్లో నేరేళ్లో

అల్లో నేరేళ్లో అల్లో నేరేళ్లో
అల్లో నేరేళ్లో అల్లో నేరేళ్లో అల్లో నేరేళ్లో అల్లో నేరేళ్లో
ఏటిపాయల పాపిటకి కుంకుమబొట్టే ఆభరణం
ఎదురు చూపుల కన్నులకి కాటుక రేకే ఆభరణం
పుడమినంటని పదములకి పసుపు వన్నెలే ఆభరణం
పెదవి దాటని మాటలకి మౌనరాగమే ఆభరణం
మగువ మనసుకి ఏనాడూ మనసైన వాడే ఆభరణం
అందాల రాముని పరిణయమాడి అయోధ్య చేరును జానకి అల్లో నేరేళ్లో
అందాల రాముని పరిణయమాడి అయోధ్య చేరును జానకి అల్లో నేరేళ్లో
చేయి జారిన చందమామని అందుకోగలనా
రాయలేని నా ప్రేమలేఖని అందచేయగలనా
దూరమైన నా ప్రాణ జ్యోతిని చేరుకోగలనా
చేరువై నా మనోవేదన మనవి చేయగలనా
నా ప్రేమతో తన ప్రేమని గెలుచుకోగలనా