LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Neeshoku Choodakunda

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
నీ సోకు చూడకుండ నవనీతమ్మ నే నిముసమైన బతకలేనె ముద్దుల గుమ్మ
నీ నీడ వదిలి ఉండలేనే ముద్దుల గుమ్మ
ఎంత మాయగాడవురా రమణయ్ మావ నిన్నే తల్లి కన్నదిరా వయ్యారి మావ
నీ కెన్ని విద్యలున్నయ్ రా వయ్యారి మావ

నీవు చూసే చూపులకు వన్నెలాడీ నీరుగారి పోతానె చిన్నెలాడి
మనసు దాచుకోలేను నవనీతమ్మ పది మాటలైన చెప్పలేను ముద్దుల గుమ్మ
నీ సోకు చూడకుండ నవనీతమ్మ నే నిముసమైన బతకలేనె ముద్దుల గుమ్మ
నీ నీడ వదిలి ఉండలేనే ముద్దుల గుమ్మ

ముచ్చట్లు చెబుతావు వన్నెకాడ మోసపుచ్చి పోతావు చిన్నవాడ
మాట వరసకైనా నువ్వు రమణయ్ మావా ఒక్క మాటైనా ఇచ్చావా రామనయ్ మావ
ఎంత మాయగాడవురా రమణయ్ మావ నిన్నే తల్లి కన్నదిరా వయ్యారి మావ
నీ కెన్ని విద్యలున్నయ్ రా వయ్యారి మావ

నీ తోటి సరసమాడి పడుచు పిల్లా నెల్లూరు వెళతానే గడుసు పిల్లా
మళ్ళీ తిరిగి వస్తానే నవనీతమ్మ నిను మరచిపోయి ఉండలేనె ముద్దుల గుమ్మ
నీ సోకు చూడకుండ నవనీతమ్మ నే నిముసమైన బతకలేనె ముద్దుల గుమ్మ
నీ నీడ వదిలి ఉండలేనే ముద్దుల గుమ్మ

నెల్లూరు పోతేను నీటుగాడా తెల్ల బియ్యం తెస్తావా నీటుగాడా
పక్క వూళ్ళో నువ్వుంటే రామనాయ్ మావ నీ ప్రాణాలు నిల్పలేను రామనాయ్ మావ
ఎంత మాయగాడవురా రమణయ్ మావ నిన్నే తల్లి కన్నదిరా వయ్యారి మావ
నీ కెన్ని విద్యలున్నయ్ రా వయ్యారి మావ

WRITERS

Atreya, Kosaraju, Sri Sri, Tapi, Venu Master

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other