LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Hara Hara Eshwara

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
హర హర ఈశ్వర శంభో శివ శంకర
ఓం నమః శివాయ నీలకంధర
శిరసున గంగమ్మతో తనువున గౌరమ్మతో
తరలిరా తనివి తీర ఈశ్వర
పోలిమేరలో వీర భద్రుడా
వెండి కొండ మీద వెల్పు నీవురా
ఇలక పాలకాల భైరవా
పాపాల పాళ్ల నుండీ కావరా
నీ ఆజ్ఞ లేక చీమైనా కుట్టని మూడు కళ్ళ రెడువురా
రుద్రం భజే రుద్ర తేజం భజే విభూది భూషణ హర
రౌద్రం భజే రౌద్ర రూపం భజే నటరాజ చంద్ర శేఖర
గంగ నెత్తుకొని నేల గొంతు నింపు జంగమయ్య నీవురా
ఆది అంతమంటూ లేని స్వామి ఆది శక్తితో మమ్మాదరించరా
హర హర ఈశ్వర శంభో శివ శంకర
ఓం నమః శివాయ నీలకంధర
శిరసున గంగమ్మతో తనువున గౌరమ్మతో
తరలిరా తనివి తీర ఈశ్వర

ఓం నమః శివాయ రుద్రాయ భద్రాయ శర్వాయ సర్వాయ
శివ పూజకు వేళయే కదలిరా
ఓం నమః శివాయ

శివరాత్రికి శివ శివ అని అవని గొంతు విప్పెరా
జాగారం జయ ధ్వానం జగమే కైలాసమై ఆడెరా
ఆటలాడుకుంటూ శంకరుడా నీ పాట పాడుకుంటూ ఈశ్వరుడా
తెల్లవార్లు భక్తి తోటి నిన్ను మొక్కి పూజలు చేసెమురా
మేలు సామివయ్య శంకర నువ్వు లేని చోటు ఎక్కడుందిరా
గరళాన్ని తాగే గరళ కంఠుడా సరిలోని సామి నిలిచినావురా
భూగోళమంతా నీ లీలా కాదా భూతనాథ రాత నీవురా
రుద్రం భజే రుద్ర తేజం భజే విభూది భూషణ హర
రౌద్రం భజే రౌద్ర రూపం భజే నటరాజ చంద్ర శేఖర
గంగ నెత్తుకొని నేల గొంతు నింపు జంగమయ్య నీవురా
ఆది అంతమంటూ లేని స్వామి ఆది శక్తితో మమ్మాదరించరా
హర హర ఈశ్వర శంభో శివ శంకర ఓం నమః శివాయ నీలకంధర
శిరసున గంగమ్మతో తనువున గౌరమ్మతో
తరలిరా తనివి తీర ఈశ్వర

ఓం నమః శివాయ యోగాయ భోగాయ రాగాయ రవ్యాయ
పంచాక్షరి వేదంలా మోగెరా
ఓం నమః శివాయ

మారేడుకు మారేడుతో అభిషేకం జరపగా
నైవేద్యం ఆతిథ్యం మా మనసులు నీకురా శంకరా
కోటి మొక్కులను తీర్చుకొని
నీ పేర్లు వెయ్యి తీరులు తలచుకొని
మళ్లీ మళ్లీ నిన్ను మొక్కుకుంటూ కొలిసెము ఈశ్వరా
జాగు లేదు నీకు శంకర జాలి గుండె నీది శివ శంకర
వరమీయవయ్య ఓరి శంకర కొనలేని ప్రేమ మాకు నీవురా
ఆకాశమంతా ఆధరణ నీది అంతా నీవు ఆది శంకర
రుద్రం భజే రుద్ర తేజం భజే విభూది భూషణ హర
రౌద్రం భజే రౌద్ర రూపం భజే నటరాజ చంద్ర శేఖర
గంగ నెత్తుకొని నేల గొంతు నింపు జంగమయ్య నీవురా
ఆది అంతమంటూ లేని స్వామి ఆది శక్తితో మమ్మాదరించరా
హర హర ఈశ్వర శంభో శివ శంకర
ఓం నమః శివాయ నీలకంధర
శిరసున గంగమ్మతో తనువున గౌరమ్మతో
తరలిరా తనివి తీర ఈశ్వర

WRITERS

Kalyan Chakravarthy

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

LyricIQ Analysis

Top Emotion

Enjoyment

Sentiment
Thumbsup IconThumbsup IconThumbsup Icon
Theme

None