LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Puttinaade Peru Vettukunnodu

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఎండకు చెమటలు పట్టించేటోడు
చలికి వణుకులు పుట్టించేటోడు
వానని బుద్ధిగా తడిపేసేటోడు
వాడితో జన్మంతా నడిపించేటోడు
పుట్టినాడే పేరు వెట్టుకున్నోడు
పెరిగిన్నాడే చేయి వట్టుకున్నోడు ఏడ ఉన్నాడో
అబ్బబ్బబ్బా ఏడ ఉన్నాడో ఎక్కడున్నాడో నన్ను వలిచినోడు
ఎట్ల ఉన్నాడొ ఎప్పుడొస్తాడో నన్ను గెలిచినోడు

మొట్ట మొదలు వాణ్ణి సూసిన సంది మొదలయింది నాకు ఒకటే రంది
లోపటంతనెమో లొల్లాయితంది ఒక్కసారైనా వచ్చి అడిగి పొడెంది
నన్ను మెచ్చినోడు నాకు నచ్చినోడు సంబురాలు సంచి నిండా తెచ్చినోడు
ఏడ ఉన్నాడో అబ్బబ్బబ్బా ఏడ ఉన్నాడో ఎక్కడున్నాడో నన్ను వలిచినోడు
ఇప్పుడు ఎట్ల ఉన్నాడొ ఎప్పుడొస్తాడో నన్ను గెలిచినోడు

నిలవడనియ్యది కూసోనియాది వాణ్ని తప్ప ఏది తలుసుకోనియ్యది
గడియ గడియాకు గంట కొడుతాంది
గడుసు మనసు వానేంట పడతాంది
తప్పు చెత్తే ఒక దెబ్బ వెట్టెటోడు తప్పిందాన్ని మల్ల గదవ వెట్టెటోడు ఏడ ఉన్నాడో
అబ్బబ్బబ్బా ఏడ ఉన్నాడో ఎక్కడున్నాడో నన్ను వలిచినోడు
ఎట్ల ఉన్నాడొ ఎప్పుడొస్తాడో నన్ను గెలిచినోడు

నడినెత్తి పోదైనా ముద్ద ముట్టట్లే నడిజాము యాలైన నిద్ర పట్టట్లే
గీరోగమేందని నోరు తిటట్లే గిదేంపి సరల సేయి గుటట్లే
సెలయేరు తీరు నవ్వేటోడు నవ్వుల్తో నా గుండె తవ్వేటోడు
ఏడ ఉన్నాడో ఎడ ఏడ ఏడ ఉన్నాడో ఎట్ల ఉన్నాడొ నాతో వచ్చేటోడు
వాడెపుడొస్తాడో ఎనుంగొస్తాడో నన్ను గెలిచినోడు

నారుకు నా లెక్క నాకే దిల్తల్లి నా పేరు నా తీరు యాదికొత్తలే
ఏ పని చేతనో అర్ధం అయితలే ఎందుకు ఏది బుర్రకెక్తలే
వలుకు దొరకని నా ఈడు జోడు ఎన్ని కలలైనా ఈడే నా ఓడు
ఏడ ఉన్నాడో వాడేడే ఉన్నాడో ఎక్కడఉన్నడో నన్ను వలిచినోడు
అబ్బబ్బబ్బా ఎట్లా ఉన్నడో ఎప్పుడొస్తాడో నన్ను గెలిచినోడు
వదిలిన బాణం తీరుకుంటాడో నన్ను వల్చినోడు
నా కదిలిన పాణం కావలుంటాడో నన్ను గెలిచినోడు
ఆ మబ్బుల పల్లకి ఎక్కి వస్తాడో నిన్ను వలిచినోడు
ముద్దుల పిల్లకి పగ్గవేస్తాడో నిన్ను గెలిచొనోడు
ఆ మబ్బుల పల్లకి ఎక్కి వస్తాడో నిన్ను వలిచినోడు
ముద్దుల పిల్లకి పగ్గవేస్తాడో నిన్ను గెలిచొనోడు

WRITERS

Mallikteja Sv

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other