LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Manava Manava

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
మానవా మానవా ఏమి కోరిక చెప్పవా చెప్పవా జాగుచెయ్యకా
సింగ సింగ సయ్యా సింగ సింగ సయ్యా సింగ సింగ సయ్యా సింగ సింగ సయ్యా
మానవా మానవా ఏమి కోరిక చెప్పవా చెప్పవా జాగుచెయ్యకా
విన్నపాలనే ఆలకించిన అప్సర నేనేరా
స్వర్గభోగమే నేల దించిన కిన్నెర నేనేరా
ఇంద్రలోకమొచ్చి కళ్ళముందు వాలినా ఎందుకంట ఇంత యోచనా
ఇంతదూరమొచ్చినాక ఇంకా అందుకోవ సోకు సూచనా
అమ్మకచెల్లా ఏముందిరో సొంపుల ఖిల్లా అదిరిందిరో
సింగ సింగ సయ్యా సింగ సింగ సయ్యా సింగ సింగ సయ్యా సింగ సింగ సయ్యా
అమ్మకచెల్లా ఏముందిరో సొంపుల ఖిల్లా అదిరిందిరో

పక్కకొచ్చెనే తిక్కపెంచెనే
పక్కకొచ్చెనే తిక్కపెంచెనే వయ్యారి నీ వాలకం
దిగ్గజాలనే ధిక్కరించెనే
దిగ్గజాలనే ధిక్కరించెనే నరుడా నీలో సాహసం
మైకంలో ముంచుతున్నది పాపా నీ పనితనం
మోహంలో ముంచుతున్నది నరుడా నీ మగతనం
కొంటె కోరిక రెచ్చగొట్టకా చుక్కా చాలింక
వేడి వేడిగా జోడుకూడగా వచ్చా నీవంక
చెయ్యేస్తే కందేలా ఉన్నావే బొమ్మా సందేహిస్తే ఎల్లా ముందుకురావమ్మా
మానవా మానవా ఏమి కోరిక చెప్పవా చెప్పవా జాగుచెయ్యకా
అమ్మకచెల్లా ఏముందిరో సొంపుల ఖిల్లా అదిరిందిరో

తియ్య తియ్యగా అందచేయనా
తియ్య తియ్యగా అందచేయనా పెదవుల్లోని అమృతం
మత్తు మత్తుగా ఊపుతున్నదే
మత్తు మత్తుగా ఊపుతున్నదే పిల్లో నన్నే నీనడుం
కౌగిల్లో వాలమన్నది ఊరించే ఉత్సవం
తందానా తాళమైనది చిందాడే యవ్వనం
సుందరాంగితో సంబరాలలో రాజ్యం నీదెదొరా
ముద్దరాలితో ముద్దులాటలో మొక్షం పొందేలా
ఆనందం ఈపైనా నీదే అంటున్నా (ఏదేమైనా మైనా నీతోనే రానా)

WRITERS

MANI SHARMA, SIRIVENNELA SITARAMA SASTRY

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist