LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Takadhimi

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
తకధిమి తాన ధింతనా తాన
తెగబడు ఈడు తొందరిది కన్నా
తకధిమి తాన ధింతనా తాన
తగువుల మారి తంతు ఇది రన్నా

కళ కళలాడు మండపం లోన
ఫెళ ఫెళమంటు పెళ్లి జరిగేన

వలదను వారు వెంట పడుతున్న
వలచిన వారు మాటవినరన్న

ఎంతటి నిఘా కాపు కాస్తున్న తుంటరి దగా దాగునా
ఎంచక్కహ రాసిపెట్టుంటె తదుపరి కదే ఆగునా
పట్టండి పుస్తె కట్రా
కొట్టండి పెల్లార్కెస్త్రా
తేల్చేద్దాం అమీ తుమీ

తకధిమి తాన ధింతనా తాన
తెగబడు ఈడు తొందరిది కన్నా
తకధిమి తాన ధింతనా తాన
తగువుల మారి తంతు ఇది రన్నా

ఎక్కడ్ర మేళతాళాలు
అడ్రస్సు చెప్పి చావరా
భాంచన్ కాల్ మొక్త బాబు
నాకేమి ఎర్క లేదయా

చస్తాడ ఏంటొ వాడ్నొదిలెయ్
నడిరోడ్లొ ఏంటి జాతర
ఊరికే గొడవేంటి రా మొగడా
గూగుల్లో కొట్టి చూడరా

సిగ్గుతొ మొహం దించుకో కొంచం పెళ్లికి అదో ముచ్చట
అంతటి మహా నేరమేం చేసాం ఎందుకు తలొంచాలట

సరదాల కంగారేమి
జరిపిద్దాం రామరామి
కానున్న అమీ తుమీ
తకధిమి తాన ధింతనా తాన
తెగబడు ఈడు తొందరిది కన్నా
తకధిమి తాన ధింతనా తాన
తగువుల మారి తంతు ఇది రన్నా
తకధిమి తాన ధింతనా తాన
వలదను వారు వెంట పడుతున్న
తకధిమి తాన ధింతనా తాన
వలచిన వారు మాటవినరన్న

తకధిమి తాన ధింతనా తాన
కళ కళలాడు మడపం లోన
తకధిమి తాన ధింతనా తాన
ఫెళ ఫెళమంటు పెళ్లి జరిగేన

WRITERS

MANI SHARMA, CHEMBOLU SEETHARAMA SASTRY

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

LyricIQ Analysis

Top Emotion

Enjoyment

Sentiment
Thumbsup Icon
Theme

None

From This Artist