LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Mamidi Kommaki

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
మామిడి కొమ్మకు మా చిలమ్మకు పొత్తే కుదిరింది
కమ్మని రుచులె పంచె పనులకు పొద్దే పొడిచింది
ఓహోహో హో హో హో
మామిడి కొమ్మకు మా చిలమ్మకు పొత్తే కుదిరింది
కమ్మని రుచులె పంచె పనులకు పొద్దే పొడిచింది హో హో
కొత్తావకాయ తనకంటి ఎరుపాయే
ముంగిళ్ళలో మురిపాలే మూతి విరూపాయే
కారాలు నూరే సందళ్ళు కోలువాయె
కాలాలు మారె కధలే ఇక మొదలాయె

గువ్వల్లే దూసుకువచ్చే గడసరి అబ్బాయి గుండెల్లో ఆశలు ఉన్నాయి
కళ్ళల్లో తియ్యని కలలే తెచ్చిన అమ్మాయి
నీకోసం నా చిరు నవ్వులు వేంచేస్తున్నాయి

ఏ నది తో ఏ వైనం ఈ నావను వెంటాడిందో ఒంటరిగా చేరింది ఈ తీరం
గుండెల్లో ఈ భారం ఎందాక నడిపిస్తుందో తేల్చదుగా ఎన్నటికీ ఈ దూరం

దారే పూలే పరచి కడ దాకా నిన్నే రమ్మంటే
చేరే గమ్యం ఎంతో గొప్పైనా అర్ధం ఉంటుందా
పోరాటం లేనే లేని ఏ క్షణమైనా నీదటుందా
తెగువె ఉంటె గెలుపే సైతం నీతో నీడై రాధ
గువ్వల్లే దూసుకువచ్చే గడసరి అబ్బాయి గుండెల్లో ఆశలు ఉన్నాయి
కళ్ళల్లో తియ్యని కలలే తెచ్చిన అమ్మాయి
నీకోసం నా చిరు నవ్వులు వేంచేస్తున్నాయి

ఏ ఓటమి ఎదురైనా ఆసెయ్ మీ వెన్నంటే నా వేకువకై పరుగే ఆగేనా
చినుకల్లే మొదలిన చిగురించినా పరిచయమేదో చివరికి ఆ సంద్రం లా మారేనా

నింగి నేల రెండు ఎపుడైనా కలిసే వీలుందా
పొంగే వానే వంతెన వేసిందా ఆ కల నిజమవధా
ఏనాడూ కలవని దిక్కులు కలసిన వింతలు కంటికి ఎన్నో
కనపడలేదా చీకటి వెలుగులు గీసిన సిత్రం మీరే
గువ్వల్లే దూసుకువచ్చే గడసరి అబ్బాయి గుండెల్లో ఆశలు ఉన్నాయి
కళ్ళల్లో తియ్యని కలలే తెచ్చిన అమ్మాయి
నీకోసం నా చిరు నవ్వులు వేంచేస్తున్నాయి

WRITERS

VANAMAALI, MANIKANTH KADRI

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other