రంగుల గాజులు తెచ్చావా రంగుల గాయాలు తెచ్చావా
రాజానగరం గంధం పేట వన్నెల గాజులు తెచ్చావా
సీతాకోక చిలుకల చెల్లి సీమంతానికి
సీత రాములు వచ్చారంట పేరంటానికి
సీతాకోక చిలుకల చెల్లి సీమంతానికి
సీతారాములు వస్తారంట పేరంటానికి
ప్రాణమైన ఇస్తానమ్మా నీ నిండు నవ్వులకి
తోరణాన్ని అవుతానమ్మా నీ ఇంటి వాకిలికి
అరచేతుల్లో పెంచానమ్మా చిన్నప్పుడు
అమ్మ అవుతుంటే చుస్తున్నానే నిన్నిప్పుడు
అరచేతుల్లో పెంచానమ్మా చిన్నప్పుడు
అమ్మ అవుతుంటే చుస్తున్నానే నిన్నిప్పుడు
సీతాకోక చిలుకల చెల్లి సీమంతానికి
సీతరాములు వస్తారంట పేరంటానికి
ముద్దుల మూటలు కట్టే బాబే చల్లగానవ్వాలి
అన్నకు బంగారు పాపే పుట్టి కోడలు అవ్వాలి
అన్నాచెల్లి అనుబంధాల చుట్టరికం
కోటి కోటి జన్మలు దాటి వరం అవ్వని
ఒడిని నింపుకోవమ్మా పసుపు కుంకుమ
నోము పండునోయమ్మా అన్న ప్రాణమా
కనుల విందు చేసేటి బుజ్జి బాబుకి
దిష్టి చుక్క నేనవుతా జన్మ జన్మకి
అల్లారుముద్దమ్మ ఈ అక్షింతలు
ఇక త్వరలోనే ఈ ఇంట్లోనా కేరింతలు
ఊయల్లో ఉపానమ్మ నిన్నప్పుడు ఆ
ఉయ్యాలే బాబుకు అవుత నేనిప్పుడు
ఊయల్లో ఉపానమ్మ నిన్నప్పుడు ఆ
ఉయ్యాలే బాబుకి అవుత నేనిప్పుడు
సీతకొక చిలుకల చెల్లి సీమంతానికి
సీతారాములు వస్తారంట పేరంటానికి
ల ల లా ల లా లా ల ల ల లా లా ల ల లా లా ల ల లా
సూర్యుడేమో ఉయాలందు పూలబంతిగా
మచ్చలేని చందమామ ఆటబొమ్మగా
తారలోఛ్చి హారమేసి హరతీయగా
నీలి మబ్బు జోల పాడే నీకు లాలిగ
పిల్లను ఇచ్చే వాళ్ళము అయినా
భయమొద్దు లేవమ్మా ఇవి బెదిరింపులే
నా మేనల్లుడి పెళ్ళికి కూడా నే పెద్దనే
మన అమ్మ చళువై పుట్టావ్ నువ్వప్పుడు
నీ పుట్టిల్లే పురిటికి అమ్మవుతుంది ఇపుడు
మన అమ్మ చలువయి పుట్టావ్ నువ్వప్పుడు
నీ పుట్టిల్లే పురిటికి అమ్మవుతుంది ఇపుడు
సీతాకోక చిలుకల చెల్లి సీమంతానికి
సీతారాములు వస్తారంట పేరంటానికి
ప్రాణమైన ఇస్తానమ్మా నీ నిండు నవ్వులకి
తోరణాన్ని అవుతానమ్మా నీ ఇంటి వాకిలికి
అరచేతుల్లో పెంచానమ్మా చిన్నప్పుడు
అమ్మవుతుంటే చుస్తున్నానే నిన్నిప్పుడు
అరచేతుల్లో పెంచానమ్మా చిన్నప్పుడు
అమ్మ అవుతుంటే చూస్తున్నానే నిన్నిప్పుడు