LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Ee Galilo

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఈ గాలిలో ఊరేగు రాగాలలో ఈ వేళ నా మనవిని వినవా
నీ ఊసులే నా గుండె లోగిళ్ళలో దాచానులే మనసును కనవా
నాలో లో లోనా నిన్నే చూస్తున్నా నువ్వే నేనా విడలేని శ్వాసనా
రోజూ నీడల్లే నిన్నే వెంటాడే పాదం కానా కడదాక సాగనా
ఈ గాలిలో ఊరేగు రాగాలలో ఈ వేళ నా మనవిని వినవా

పూసే పువ్వా ఇది విన్నావా
కూసే గువ్వా ఇటుగా వాలవా
మువ్వా నువ్వూ దయచేసావా
పువ్వులా విరబూస్తున్నా గువ్వలా ఎగిరొస్తున్నా
మువ్వలా నవ్వుతున్నా నన్ను చూడవే
తెలుపరే ఇకమీదైనా మారదా మన తీరైనా గుండెలో ప్రేమై రానా
ఈ గాలిలో ఊరేగు రాగాలలో ఈ వేళ నా మనవిని వినవా
ఈ ఊసులే నా గుండె లోగిళ్ళలో దాచానులే మనసుని కనవా

నిన్నా మొన్నా కలగన్నానా
నేడే నన్నే ఎద కవ్వించెనా
రేయీ పగలూ తన ధ్యాసేనా
ఇంతగా వారిస్తున్నా చెంతకే రానంటున్నా
ఎందుకీ మనసుకు మాత్రం ఇంత యాతనా
జంటగా ముడిపెడుతున్నా
జంకితే ముడి దొరికేనా జన్మకే బంధం కానా
నాలో లో లోనా నిన్నే చూస్తున్నా నువ్వే విన్నా విడలేని శ్వాసనా
రోజూ నీడల్లే నిన్నే వెంటాడే పాదం కానా కడదాక సాగనా
ఈ గాలిలో ఊరేగు రాగాలలో ఈ వేళ నా మనవిని వినవా
నీ ఊసులే నా గుండె లోగిళ్ళలో దాచానులే మనసుని కనవా

WRITERS

VANAMAALI, MICKEY J MAYOR

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

LyricIQ Analysis

Top Emotion

Enjoyment

Sentiment
Thumbsup IconThumbsup Icon
Theme

None

From This Artist