LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Sitamma Vakitlo

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
వేకువ లోన గోదారి ఎరుపెక్కింది
ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది
వేకువ లోన గోదారి ఎరుపెక్కింది
ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది

పండిన చేతికెన్నో సిగ్గులొచ్చి ఆహ సిగ్గంతా చీర గట్టింది
చీర లో చందమామ ఎవ్వరమ్మా ఆ గుమ్మ సీతమ్మా
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
సిరిమల్లె చెట్టేమో విరగబూసింది
కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు
కోసినవ్వని సీత కొప్పు చుట్టండి
కొప్పున పూలు గుప్పె డెందుకండి
కోదండ రామయ్య వస్తున్నాడండి

రానే వచ్చాడోయమ్మా ఆ రామయ్య
వస్తూ చేసాడోయమ్మా ఎదో మాయ
రానే వచ్చాడోయమ్మా ఆ రామయ్య
వస్తూ చేసాడోయమ్మా ఎదో మాయ

సీతకి రాముడే సొంతమయ్యే చోటిది
నేలతో ఆకాశం వియ్యమొందే వేళిది
మూడు ముళ్ళు వేస్తే మూడు లోకాలకి ముచ్చటొచ్చేనమ్మా ఊ ఊ
ఏడు అంగలేస్తే ఏడు జన్మలకి వీడదీ సీతమ్మ
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చేట్టు
సిరిమల్లె చెట్టు పై చిలక వాలింది
చిలకమ్మా ముద్దు గ చెప్పిందో మాట
ఆ మాట విన్న మా రామ అంటుంది
రామ రామ అన్నది ఆ సీత గుండె
అన్ననాడే ఆమెకి మొగుడయ్యాడే
చేతిలో చేతులే చేరుకుంటే సంబరం
చూపులో చూపులే లీనమైతే సుందరం
జంట బాగుందంటూ గొంతు విప్పాయంట చుట్టూ చెట్టు చేమ
పంట పండిందంటూ పొంగిపోయిందమ్మా ఇదిగో ఈ సీతమ్మ

WRITERS

ANANTH SRIRAM, MICKEY J MAYOR

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist