LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Dheerasameere Yamuna

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ధీర సమీరే యమునా తీరే వసతివనే వనమాలి
గ్రామ సమీపే ప్రేమ కలాపే చెలి తగునా రసకేళి

ఆకాశమే నా హద్దుగా నీ కోసమొచ్చా ముద్దుగా
తెచ్చానురా మెచ్చానురా గిచ్చేయి నచ్చిన సొగసులు

ధీర సమీరే యమునా తీరే వసతివనే వనమాలి
గ్రామ సమీపే ప్రేమ కలాపే చెలి తగునా రసకేళి

వేసంగి మల్లెల్లో శీతంగి వెన్నెల్లో వేసారిపోతున్నారా రారా
హేమంత మంచుల్లో ఏకాంత మంచంలో వేటాడుకుంటున్నానే నిన్నే
మొటిమ రగులు సెగలో తిరగబడి మడమ తగులు వగలో
చిగురు వణుకు చలిలో మదనుడికి పొగరు పెరిగె పొదలో
గోరింట పొద్దుల్లోన పేరంటాలే ఆడే వేళ
ధీర సమీరే యమునా తీరే వలచితి నే వనమాలి
గ్రామ సమీపే ప్రేమ కలాపే ప్రియ తగునా రసకేళి

లేలేత నీ అందం నా గీత గోవిందం నా రాధ నీవేలేవే రావే
నీ గిల్లికజ్జాలు జాబిల్లి వెచ్చాలు నా ఉట్టి కొట్టేస్తున్నా రావా
వయసు తెలిసె ఒడిలో యద కరిగి తపన పెరుగు తడిలో
మనువు కుదిరె మదిలో ఇంకిపుడు చనువు ముదురు గదిలో

వాలారు సందెల్లోన వయ్యారాలే తాకే వేళ
ధీర సమీరే యమునా తీరే వలచితి నే వనమాలి

ఆ గ్రామ సమీపే ప్రేమ కలాపే ప్రియ తగునా రసకేళి
ఆకాశమే నా హద్దుగా నీ కోసమొచ్చా ముద్దుగా

తెచ్చానురా మెచ్చానురా గిచ్చేయి నచ్చిన సొగసులు
ధీర సమీరే యమునా తీరే వసతివనే వనమాలి

గ్రామ సమీపే ప్రేమ కలాపే చెలి తగునా రసకేళి

WRITERS

VETURI, M.M. SRILEKHA

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other