నవ్వుతుంటడు కన్నుగొడతడు సైగ జేత్తడు
వాడు మురిపాల ముద్దుల కృష్ణుడు
తెలివిగల్లోడు తెల్లగుంటడు
నన్ను సాటుకిలిసి ముచ్చటంటడు
ముద్దులంటడు సరసమంటడు లొల్లి జేత్తడు
ఇగ పొద్దున్నే మా వాడకత్తడు
బండిదెత్తడు ఎక్కమంటడు పోదామంటడు
నేనడిగింది నాకు గొనిత్తడు
రాణివంటడు రాజునంటడు మురిసిపోతడు
వాడు సక్కని మనసున్న పోరడు
తోడుగుంటడు సాయమైతడు సాగిపోతడు
వాడు ఆస్తి పాస్తి దండిగున్నోడు
అందరితోని గలిసి మెలిసుంటడు
బుద్ధిమంతుడు సదువుకున్నోడు సక్కనైనోడు
వాడు సుక్కల్లో మెరిసేటి సెంద్రుడు
కలవ కళ్ళోడు కాంతి నవ్వోడు
దారి ఇస్తడు పక్కకెలతడు పారిపోతడు
మరి నేనంటే పడి సచ్చిపోతడు
వాడు పడుకున్నా నా పేరే తల్తడు
మొండి గుణమోడు మాయజేశాడు మనసు దోశాడు
నా మేనత్త ముద్దుల కొడుకాడు
యేలువడతాడు ఏలుకుంటాడు తోడుగుంటాడు
నా మేనత్త ముద్దుల కొడుకాడు
యేలువడతాడు ఏలుకుంటాడు తోడుగుంటాడు