తగిలీ తగలగనే తన చేయే గడుసుగా
లో లో కలిగినదే తొలిప్రేమే మృదువుగా
వయ్యారి రా గయ్యాలి రా గలాటాల కొలిమి రా
సింగారి రా సివంగి రా సలిమంతల సురుకు రా
ఆవిరైపోయా తన అందం ఎండల్లో
చూడు చూడు గుండె జోరు గట్టి డప్పు కొట్టినంత హోరు
నిన్నా మొన్నా లేని తీరు ప్రేమ అంటారా దీని పేరు
ఆమె నవ్వు మెరుపు వెలుగులా కనబడగా
తాను వచ్చి కనుల ఎదురుగా నిలబడగా
పుట్టుకొచ్చె హడవిడి భలేగుందిగా
నమ్మలేను నేనే ఇదంతా మారిపోయినాదె కథంతా
ఒక్క చూపులోనె నిజంగా నాటుకుంది ప్రేమె బలంగా
ఆవిరైపోయా తన అందం ఎండల్లో
నందనానానే నందనానానే నందనానానే ఏ ఏ
చూడు చూడు గుండె జోరు గట్టి డప్పు కొట్టినంత హోరు
నిన్నా మొన్నా లేని తీరు ప్రేమ అంటారా దీని పేరు