అందమైన ప్రేమ లేఖ నువ్వులే అస్తమాను చదువుకుంటనే
కళ్లలోన కాంతిరేఖ నువ్వులే నిన్నేలాగా వదులుకుంటనే
నీ ఊసు లేని ఏ ఊసు వద్దులే నీ శ్వాస నాలో దాచానులే
వెళ్లకే నన్నొదిలి నువ్వలా వెళ్ళకే వెళ్ళకే కన్నులలో నీరులా జారకే వెళ్ళకే
అరె ఇక్కడ అక్కడ ఎక్కడ చూడు కనబడేది మనమే
ఏ ఎక్కడికెక్కడ పలకరిస్తు ఎదురయ్యేది మనమే
నీతోడు నేననీ నా నీడ నువ్వని మన మధ్య ప్రేమని ఎలా మరువనే
నీ చెంత ఏదనీ నీ వెంట లేదని గతమంతా అడిగితే నేనేం చెప్పనే
నీ జ్ఞాపకాలు వదిలేసి నన్నిలా ఓ జ్ఞాపకంలా మారిపోకలా
వెళ్లకే నన్నొదిలి నువ్వలా వెళ్ళకే వెళ్ళకే కన్నులలో నీరులా జారకే వెళ్ళకే
అందమైన ప్రేమ లేఖ నువ్వులే అస్తమాను చదువుకుంటనే
కళ్లలోన కాంతిరేఖ నువ్వులే నిన్నేలాగా వదులుకుంటనే
నీ ఊసు లేని ఏ ఊసు వద్దులే నీ శ్వాస నాలో దాచానులే
వెళ్ళకే నా మనసే నువ్విలా కొయ్యకే
వెళ్ళకే నిప్పులలో నన్నిలా తొయ్యకే
వెళ్ళకే వెళ్ళకే నన్నొదిలి నువ్వలా జారకే కన్నులలో నీరులా
వెళ్ళకే నన్నొదిలి నువ్వలా జారకే కన్నులలో నీరులా
WRITERS
Saurabh Malhotra, Bharat Hans, Anirudh Ravichander, Banisetti Suresh Kumar