నెలమూడు శోభనాలు నీకు అతనికి తగును
నెలమూడు శోభనాలు నీకు అతనికి తగును
రామనామమతనిది రామవు నీవైతేను
రామనామమతనిది రామవు నీవైతేను
వామనుడందురతని వామ నయనవు నీవు
వామనుడందురతని వామ నయనవు నీవు
ప్రేమపు మీ ఇద్దరికి పేరుబలమొకటే
నెలమూడు శోభనాలు నీకు అతనికి తగును
హరి పేర అతనికి హరిణేక్షణవు నీవు
కరిగాచె తాను నీవు కరియానవు
హరి పేర అతనికి హరిణేక్షణవు నీవు
కరిగాచె తాను నీవు కరియానవు
సరి జలధీశాయి జలధికన్యవు నీవూ
సరి జలధీశాయి జలధికన్యవు నీవూ
బెరసి మీ ఇద్దరికి పేరుబలము ఒకటే
నెలమూడు శోభనాలు నీకు అతనికి తగును
జలజ నాభుడతడు జలజ ముఖివి నీవు
అలమేలు మంగవు నిన్నలమే తాను
జలజ నాభుడతడు జలజ ముఖివి నీవు
అలమేలు మంగవు నిన్నలమే తాను
ఇలలో శ్రీ వేంకటేశుడు ఇటు నిన్నురాన మోసె
ఇలలో శ్రీ వేంకటేశుడు ఇటు నిన్నురాన మోసె
పిలిచి పేరు చెప్పే పేరు బలము ఒకటే
నెల మూడు శోభనాలు నీకు అతనికి తగును
నెల మూడు శోభనాలు నీకు అతనికి తగును
కలకాలము నిత్య కళ్యాణమమ్మా