కంటి శుక్రవారము గడియ లేడింట అంటి అలమేల్మంగ అండనుండే స్వామిని
కంటి శుక్రవారము గడియ లేడింట
అంటి అలమేల్మంగ అండనుండే స్వామిని కంటీ
సొమ్ములన్నీ కడపెట్టి సొంపుతో గోణముగట్టి కమ్మని కదంబము కప్పు కన్నీరు

చెమ్మతోను వేష్టువలు రొమ్ముతల మొలజుట్టి చెమ్మతోను వేష్టువలు రొమ్ముతల మొలజుట్టి
తుమ్మెద మైచాయతోన నెమ్మదినుండే స్వామిని
కంటి శుక్రవారము గడియ లేడింట అంటి అలమేల్మంగ అండనుండే స్వామిని కంటీ
పచ్చకప్పురమే నూరిపసిడి గిన్నెలనించి తెచ్చి శిరసాదిగ దిగనలది

అచ్చెరపడి చూడ అందరి కనులకింపై అచ్చెరపడి చూడ అందరి కనులకింపై
నిచ్చమల్లె పూవువలె నిటుతానుండే స్వామిని
కంటి శుక్రవారము గడియ లేడింట అంటి అలమేల్మంగ అండనుండే స్వామిని కంటీ
తట్టుపునుగే కూరిచిచట్టలు చేరిచినిప్పు పట్టి కరిగించు వెండి పళ్యాలనించి

దట్టముగ మేను నిండపట్టించి దిద్ది దట్టముగ మేను నిండపట్టించి దిద్ది
బిట్టు వేడుక మురియు చుండేబిత్తరి స్వామిని