LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Cheliya Cheliya

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
లలలా లాలా లలలా
లలలా లాలా లలలా
లల లాలా లల లాలా హ్మ్

చెలియా చెలియా చెలియా చెలియా
చెంత చేరి జంట కడితే చలియా గిలియా

మదనా మదనా సుందర వదనా
కన్నుగీటి పిలవగానే పరుగున రానా

ప్రియురాలు ఇచ్చింది పెదవి లంచము
దొరగారి కౌగిలే నా ప్రపంచము

రస సీమలో చేయనా పరిపాలనం
చెలియా చెలియా చెలియా చెలియా
చెంత చేరి జంట కడితే చలియా గిలియా

మదనా మదనా సుందర వదనా
కన్నుగీటి పిలవగానే పరుగున రానా

వయ్యారి ఈ చిన్నది పడకటింటి కయ్యానికొస్తున్నది
ఓరయ్యో కామయ్యె ఏం చేసినావయ్యో నాకేదో అవుతున్నది

మనసైన మగధీరుడు అయ్యయ్యో అయ్యారే సుకుమారుడు
ఈ ప్రేమ పాఠాలు నీ చేతి వాటాలు నే చేసి చూపించని

యతి కూడ మతిపోయి జతకోరగా రతియోగమంటాను జపియించగా
నీ తీయని అల్లరి చేస్తుంది నా

చెలియా చెలియా చెలియా చెలియా
చెంత చేరి జంట కడితే చలియా గిలియా

మదనా మదనా సుందర వదనా
కన్నుగీటి పిలవగానే పరుగున రానా

జేగంట మోగించని చిన్నదాన్ని జాగారం చేయించని
లేలేత అందాల గంధాలు తీయించి గ్రంధాలు రచియించని

నా ముడుపు చెల్లించని చెప్పరాని పాఠాలు వల్లించని
శ్రీగీత గోవింద శృంగార శ్లోకాల గానాలు సాగించని

కన్నయ్య అలివేణి ఆ రాధిక కాదయ్య పోవయ్య అనరాదిక
మది మురళిని సరళిలో రవలించగా

చెలియా చెలియా చెలియా చెలియా
చెంత చేరి జంట కడితే చలియా గిలియా

మదనా మదనా సుందర వదనా
కన్నుగీటి పిలవగానే పరుగున రానా

ప్రియురాలు ఇచ్చింది పెదవి లంచము
దొరగారి కౌగిలే నా ప్రపంచము

రస సీమలో చేయనా పరిపాలనం
చెలియా చెలియా చెలియా చెలియా
చెంత చేరి జంట కడితే చలియా గిలియా

మదనా మదనా సుందర వదనా
కన్నుగీటి పిలవగానే పరుగున రానా

WRITERS

CHAITANYA PRASAD, RABINDRA PRASAD PATTNAIK

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

LyricIQ Analysis

Top Emotion

Enjoyment

Sentiment
Thumbsup IconThumbsup Icon
Theme

None

From This Artist