అవునని అంటావో మరి కాదని అంటావో
ఏమని చెప్పాలో నీకేమని చెప్పాలో
తెలియక సతమతమవుతోంది నా మనసెంతో
అటో ఇటో ఎటో మరి తేలని నిమిషంలో
ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమని
ఎలా చూపనమ్మా నా ప్రేమ నువ్వని
అవునని అంటావో మరి కాదని అంటావో
ఎప్పుడో నే పంపించాను నువ్వు చూడలేదా
ఎప్పుడో నే పంపించాను నిన్ను చేరలేదా
చెప్పాలని అనిపిస్తున్నా నా ఎదుటే నువ్వు కూర్చున్నా
మనసులోని మాట నీకు చెప్పలేకపోతున్నా
చెప్పకుండా ఓ క్షణమైనా ఉండలేకపోతున్నా
ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమని
ఎలా చూపనమ్మా నా ప్రేమ నువ్వని
అవునని అంటావో మరి కాదని అంటావో
పరిచయమే లేదని అంటే వింతే కదా
మదిలోనే నువ్వు నిదరోతు గమనించలేదా
ఎదనిండా ఆశలు ఉన్నా ఎన్నెన్నో ఊసులు ఉన్నా
ప్రేమ భాష రాదు అంటే నమ్మవా ఓ మైనా
కళ్ళలోకి చూసి అయినా పోల్చుకోవా నా ప్రేమ
ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమని
ఎలా చూపనమ్మా నా ప్రేమ నువ్వని
అవునని అంటావో మరి కాదని అంటావో
ఏమని చెప్పాలో నీకేమని చెప్పాలో
తెలియక సతమతమవుతోంది నా మనసెంతో
అటో ఇటో ఎటో మరి తేలని నిమిషంలో
ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమని
ఎలా చూపనమ్మా నా ప్రేమ నువ్వని
ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమని
ఎలా చూపనమ్మా నా ప్రేమ నువ్వని