LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Gundello Vaalava

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
గుండెలో వాలవా చెలి చిలకా శ్వాసలో కోరిక విన్నావుగా
కళ్ళలో చేరవా తొలి వేలుగా నీడవై చాటుగా వున్నావుగా
మాటలే చేత కాక సైగ చేశానుగా
సంతకం లేని లేఖ చేరనే లేదుగా
కలుసుకో త్వరగా కళలు నిజమవగా
గుండెలో వాలవా చెలి చిలకా శ్వాసలో కోరిక విన్నావుగా

నీ వెంటే తరుముతు ఉంటె అసలు కన్నెత్తి చూసావా నన్ను
మరి నీ ముందే తిరుగుతూ ఉంటె ఎపుడు పన్నెత్తి పిలిచావా నన్ను
రోజు ఇలా ఈ గాలిలా నీ చెవిని తాకేది నేనేగా
మామూలుగా మాటాడక ఈ గాలి గోలేంటి చిత్రంగా
కలుసుకో త్వరగా కళలు నిజమవగా
కళ్ళలో చేరవా తొలి వేలుగా నీడవై చాటుగా వున్నావుగా

కాస్తైనా చోరవ చెయ్యందె వరస కలిపేదెలాగంటా నీతో
నువ్వు కొంతైనా చనువు ఇవ్వందె తెల్సుకోలేను నీ సంగతేదో
వెంటాడక వేటాడక వలలోన పడుతుందా వలపైనా
నన్నింతగా వేధించక మన్నించి మానసివ్వు ఇపుడైనా
కలుసుకో త్వరగా కళలు నిజమవగా
గుండెలో వాలవా చెలి చిలకా శ్వాసలో కోరిక విన్నావుగా
కళ్ళలో చేరవా తొలి వేలుగా నీడవై చాటుగా వున్నావుగా
మాటలే చేత కాక సైగ చేశానుగా
సంతకం లేని లేఖ చేరనే లేదుగా
కలుసుకో త్వరగా కళలు నిజమవగా
కళ్ళలో చేరవా (చెలి చిలకా శ్వాసలో కోరిక) విన్నావుగా

WRITERS

R.P. PATNAIK, SIRIVENNELA SITARAMA SASTRY

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other