యాడికెల్లి వచ్చినావే నా గుండెల్లో గువ్వల్లే వాలినవే
ఓ రా సూపే ఇసిరినావే నీ మాటలతో మాయాల్ని చేసినవే
నా కన్నుల్లో మేరుపల్లె మెరిసినవే
నా కలలలో రంగుల్ని అద్దినవే
నీ కాలికి మువ్వాళ్ళే కట్టినవే
నీ ఏనకాలే నీడల్లే తిప్పినవే నీడల్లే నీడల్లే
సిన్ని గుండెకు సుట్టుకున్నావే సిన్ని ఊపిరిని నింపిపోవే
సిన్ని నిద్దుర దోచుకునవే సిన్ని నవ్వైనా సళ్లిపోవే
యాడికెల్లి వచ్చినావే నా గుండెల్లో గువ్వల్లే వాలినవే
ఏ అక్షరాలు చూసినా నీ పేరల్లే ఆగుపడ్తాథే
ఓ లక్షసర్లు తలచిన నాకు విసుగైతే రాకున్నాథే
ఏ దారిలోన నడిచినా నీ సెంతకే సేరుస్తధే
ఓ నిమిషము చూసాక మనసే ఆగమైపోతున్నాథే
ఆకాశమంత నిండిన ప్రేమను నాలోన మొయ్యలెనే
నీ ధోసిట్టనైన పట్టి చూడవే సినుకల్లే సేరుతనే
సిన్ని గుండెకు సుట్టుకున్నావే సిన్ని ఊపిరిని నింపిపోవే
సిన్ని నిద్దుర దోచుకునవే సిన్ని నవ్వైనా సళ్లిపోవే
యాడికెల్లి వచ్చినావే నా గుండెల్లో గువ్వల్లే వాలినవే
ఓ వంద జన్మలెత్తినా నీ సెయ్యి ఈడిసిపెట్టనే
ఏ ఇంటా నువ్వు పుట్టినా ఆ ఇంటికల్లుడైతనే
ఆ సందమామా చూసినా నీ చిరునవ్వు యాదొస్తదే
ఏ మబ్బులు వచ్చి ఆపినా నా తీరు మారకున్నాదే
ఇద్దరి మధ్య నిలుసున్న ధూరం నిలువనీయకున్నాదే
నువ్వులేని బతుకు నాకు ఎండమావి పిల్ల సా వైన రాకున్నాదే
సిన్ని గుండెకు సుట్టుకున్నావే సిన్ని ఊపిరిని నింపిపోవే
సిన్ని నిద్దుర దోచుకునవే సిన్ని నవ్వైనా సళ్లిపోవే